Hyderabad: హైదరాబాద్ లో పానీపూరీ బ్యాన్..?.. ఆ రెండు రాష్ట్రాల ఘటనలే కారణమా.. బల్దియా సీరియస్..

Panipuri Ban: కొన్నిరోజులుగా పానీపూరీలో  క్యాన్సర్ కారకమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారని అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల కర్ణాటక, చెన్నైలో కూడా ఫుడ్ సెఫ్టీ అధికారులు అనేక పానీపూరీ దుకాణాల నుంచి సాంపుల్స్ లను సేకరించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 4, 2024, 12:49 PM IST
  • పానీపూరీలో హనీకర రసాయనాలు..
  • అలర్ట్ అయిన బల్దియా సిబ్బంది..
Hyderabad: హైదరాబాద్ లో పానీపూరీ బ్యాన్..?.. ఆ రెండు రాష్ట్రాల ఘటనలే కారణమా.. బల్దియా సీరియస్..

cancer causing substance finds in panipuri Hyderabad food safety alerts: చాలా మంది సాయంత్రంకానేగా పానీపూరీ,కట్లేట్ లను తింటుంటారు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లు పానీపూరీని ఎంతో ఇష్టంతో తింటారు. ఈ నేపథ్యంలో పానీపూరీ లవర్స్ కు మాత్రం ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు ఇలా ప్రతి చోట ఈ మధ్య కాలంలో పానీపూరీల బిజినెస్ జోరుగా నడుస్తు ఉంటుంది. చాలా మంది పానీపూరీలను ఎంతో  ఇష్టంతో తింటారు. అమ్మాయిల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక, చెన్నై లలో పానీపూరీలో హనీకర రసాయనాలు ఉపయోగిస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. దీనిలో భాగంగానే.. అధికారులు రంగలోకి దిగి సాంపుల్స్ తీసుకున్నారు. వీటిని ల్యాబ్ లకు పంపించి విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

పానీపూరీలో రంగుల కోసం.. బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్, సన్ సెట్, ఎల్లో లాంటి హనీకరమైన రంగులను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల స్టమక్ క్యాన్సర్, అనేక ఇతర సమస్యలు వస్తాయని పరిశోధనల్లో తెలింది. దీంతో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పానీపూరీల సాంపుల్స్ పై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, ప్రత్యేకంగా కమిటీని నియమించినట్లు సమాచారం. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తొందరలోనే కర్ణాటక, చెన్నైలు పానీపూరీలపై నిషేధం విధిస్తాయని కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్నిరోజలుగా హైదరాబాద్ లో ఫుడ్ సెఫ్టీ అధికారులు అనేక హోటళ్లు, రెస్టారెంట్ ల మీద దాడులు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసం, ఇతర పదార్థాలపై తనిఖీలు చేస్తున్నారు. ఇక తాజాగా, పానీపూరీలపై కూడా హైదరాబాద్ ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయని తెలుస్తోంది.

 హైదరాబాద్ లో పానీపూరీ అమ్మకాలపై నజర్..

హైదరాబాద్ ఫుడ్ సెఫ్టీ అధికారులు సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ఫుడ్ సెప్టీ అధికారులకు కూడా పానీపూరీ ఘటనపై వరుసగా ఫిర్యాదులు అందాయంట. అసలే వర్షాకాలం. చాలా చోట్ల కలుషిత నీటి వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో పానీపూరీకి ఉపయోగించే నీళ్లను చాలా వరకు , తాగడానికి అంతగా మంచిది కానీ వాటర్ నే ఉపయోగిస్తున్నారని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాకుండా.. పానీపూరీ పరిసరాల్లో మినిమమ్ శుభ్రత కూడా ఉండట్లేదని ప్రజలు వాపోతున్నారు.

మురికిగా ఉండే చేతులతోనే.. పానీపూరీ అందిస్తు.. ప్రజల ఆరోగ్యం డెంజర్ లో పడేలా చేస్తున్నారంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో బల్దీయా ఫుడ్ సెఫ్టీ అధికారులు సైతం దీనిపై సమాలోచనలు చేస్తున్నారని, ఇక హైదరబాద్ లో కూడా ఉన్న పానీపూరీ బండ్లపై కొరడా ఝుళిపించడానికి బల్దీయా సిబ్బంది పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Read more: Snake: పిల్లపామే కదా అని నోట్లో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.?.. వీడియో వైరల్..

ఇక్కడ నుంచి కూడా పానీపూరీ సాంపుల్స్ సేకరించి, ల్యాబ్ లకు పంపిస్తారని సమాచారం. ఒక వేళ క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని ఫలితాలు వస్తే.. పానీపూరీలను బ్యాన్ చేయడానికి సైతం వెనుకాడబోమని ఫుడ్ సెఫ్టీ అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల ప్రాణాలు,ఆరోగ్యం తమ ఫస్ట్ ప్రయారిటీగా అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News