Group 4 Results: గ్రూప్‌- 4 పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..

Group-4 Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫ‌లితాలను విడుదల చేసింది. అభ్య‌ర్థులు తమ ర్యాంకులను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ కు వెళ్లి చూసుకోవచ్చు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 10:42 PM IST
 Group 4 Results: గ్రూప్‌- 4 పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..

TSPSC Group-4 Results: తెలంగాణలో గ్రూప్‌-4 ఫలితాలు(TSPSC Group 4 Results) విడుదలయ్యాయి. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ను విడుదల చేసినట్లు శుక్రవారం రాత్రి టీఎస్‌పీఎస్సీ వెల్ల‌డించింది. అభ్యర్థులు తమ ర్యాంకులను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా ధ్రువ‌ప‌త్రాల వెరిఫికేష‌న్‌కు ఎంపికైన వారి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది. 

గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగ‌తి తెలిసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గతేడాది జులైలో గ్రూప్-4 రాత‌ప‌రీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 80శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 

Also Read: Big Shock For BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. హస్తం గూటికి బాబా ఫసియూద్దీన్..

Also Read: PV Narasimha Rao: పీవీ నరసింహారావుకు భారతరత్న.. ఇది కాంగ్రెస్ కు చెంపపెట్టు అన్న పీవీ మనవడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News