TSPSC Group-2 Exam Postponed: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ముందుగా టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. మొత్తం 783 గ్రూప్- 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 29, 30వ తేదీల్లోనే పరీక్షలు పూర్తవ్వాల్సి ఉంది.
అయితే అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోదని.. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఆందోళనలు చేశారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేసింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగా.. టీఎస్‌పీఎస్పీని ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్, సభ్యులు రాజీనామాల తరువాత ప్రస్తుత పరిస్థితుల్లో గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం మళ్లీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడడంతో నిరాశకు గురవుతున్నారు.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter