Telangana Govt 10Th Class: తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు రద్దును అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల అంటే నవంబర్ 28న తీసుకున్న నిర్ణయాన్నితాజాగా వెనక్కి తీసుకుంది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటివరకు.. ఒక్కో సబ్జెక్టుకు మొత్తం 100 మార్కులకు గానూ.. వార్షిక పరీక్షల్లో 80 మార్కులు కేటాయించగా.. ఇంటర్నల్ మార్క్స్ కింద 20 మార్కులుగా కేటాయించారు. కాగా.. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్నల్ పరీక్షలకు మార్కుల విధానాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక నుంచి 6 సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయంటూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే ఈ మార్పులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
సర్కార్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక నిర్ణయాలను విద్యా సంవత్సరం మొదట్లోనే ప్రకటిస్తే.. అందుకు అనుగుణంగా విద్యార్థులు అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతారన్నారు. కానీ పరీక్షలకు కేవలం 4 నెలల ఉందనగా వెల్లడించటం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.దీంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
ఈ కొత్త విధానంపై పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఏకంగా 3 నెలల 10 రోజులకు దీనిపై నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 80 మార్కులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్- ఎస్‌ఏ-1 పరీక్షలు పూర్తికావటంతో.. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రకటించటం ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదన్నారు. విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గురువారం రోజున ప్రకటించిన తన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే.. ఈ కొత్త విధానాన్ని వచ్చే ఏడాది అంటే.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter