తెలంగాణ ( Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 7న పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అవనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఇతర ప్రధాన అంశాలు, సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రేపు ఉదయం 11.30 నిమిషాలకు సీఎం కేసీఆర్ ( KCR ) అధికారిక నివాసం, కార్యాలయం అయిన ప్రగతీ భవన్ లో ఈ మీటింగ్ జరగనుంది.
ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్
ఈ మీటింగ్ లో తెలంగాణలో శాంతి భద్రతలు, అడవుల సంరక్షణ, డ్రగ్స్ కంట్రోలింగ్, స్మగ్లింగ్ ను అరికట్టడం, మహిళల రక్షణ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి అని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ, అటవీశాఖ మినిస్టర్ ఇంద్రకరణ రెడ్డి, ప్రభుత్వ సీఎష్ సోమేష్ కుమార్ తో పాటు డీజీపి మహేందర్ రెడ్డి ఇతర ప్రముఖ అధికారులు పాల్గోనున్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి సమాచారం అందించింది.
ఆ ట్వీట్ ఇదే..
రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్ లో పోలీసు ఉన్నతాధికారుల విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు.
— Telangana CMO (@TelanganaCMO) October 5, 2020
ALSO READ| Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR