KCR Comments: తెలంగాణ యాస ఉంటేనే ఆ సినిమా హిట్: సీఎం కేసీఆర్

రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తెలుగు సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ యాస ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని కామెంట్స్ చేసారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 12:06 PM IST
  • రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • తనదైన శైలిలో ప్రసంగం ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • ఉద్యమ సమయాల్లో ఎదుర్కొన్న సమస్యల గురించి గుర్తు చేసుకున్న సీఎం
KCR Comments: తెలంగాణ యాస ఉంటేనే ఆ సినిమా హిట్: సీఎం కేసీఆర్

KCR Comments on Telangana Slang in Movies: రెండో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగాన్ని ఆరంభించారు. మొదటగా ఉద్యమ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, 14 ఎల్లా సుదీర్ఘ ఘర్షణ తరువాత తెలంగాణ సాకారమైందని తెలియజేసారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష అన్యాయాలతో తెలంగాణ రాష్ట్రం వెనుక బడిపోయిందని, ప్రజలు చాలా క్షోభ, బాధలను అనుభవించారని మరో సారి సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 

అంతేకాకుండా, తెలంగాణ ప్రజలు ఆకలి చావులు, ఉద్యోగాలు లేక యువత ఆయుధాలను చేత బట్టి ఉద్యమం వైపు వెళ్లారని తెలిపారు. అన్ని విధాలా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలు ఒకప్పుడు సినిమాలలో కేవలం కమెడియన్లుగా, జోకర్లుగా మాత్రమే చేసేవారని.. కానీ ఇపుడు తెలంగాణ యాస వాడితేనే సినిమా హిట్ అవుతుంటాని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

సమైక్య రాష్ట్ర సమయంలో నిధులు, నీళ్లు, నియామకాలపై తెలంగాణపై వివక్షత చూపించారని.. ఈ మూడు సాధించటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత మన నీళ్లు తెచ్చుకున్నాం, మన నిధులు మనమే తెచ్చుకున్నాం.. రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ ప్రతి రూపాయి మన ప్రజల కోసమే వినియోగపడిందని తెలిపారు. నీళ్లు, నిధుల విషయంలో ముందడుగులో ఉన్నప్పటీకి నియామకాలపై ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌తో పంచాయితీ జరుగుతుందని తెలిపారు. 

అంతేకాకుండా.. రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం విముఖత చూపుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సమస్యలను పరిస్కహరించటం లేదని.. నియామకాలపై, తెలంగాణ ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివాదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: AB De Villiers: మనసు మార్చుకున్న ఏబీ డివిలియర్స్, ఆర్సీబీతో మరోసారి ఒప్పందమా 

Also Read: Todays Gold Rate: బంగారం ధర ఆకాశానికి..తులం బంగారం 55 వేలకు చేరువలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News