Kalki 2898 AD Review: ‘కల్కి’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా..?

Kalki 2898 AD Censor Review: రెబల్ స్టార్ ప్రభాస్ ఎపుడెపుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమా పై సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సారి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉండబోతుదని హింట్ ఇచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 24, 2024, 06:08 PM IST
Kalki 2898 AD Review: ‘కల్కి’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా..?

Kalki 2898 AD Censor Review: బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ సినిమాలు అనుకున్నంత రేంజ్ లో నడవకపోయినా.. హీరోగా ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సింహం ఒక అడుగు వెనక్కి వేసినట్టు.. ఫ్లాప్ లతో గోడకు కొట్టిన బంతిలా మళ్లీ బ్యాక్ బౌన్స్ అవుతున్నారు. గతేడాది ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రభాస్.. ఇపుడు ‘కల్కి’ మూవీతో అది కంటిన్యూ చేయబోతున్నట్టు ఈ సినిమా సెన్సార్ సభ్యుల టాక్  బట్టి తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ సినిమాల మహా భారత కాలం నుంచి 2898 AD వరకు 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. తాజాగా సెన్సార్ సభ్యలు నుంచి వచ్చిన రివ్యూ ప్రకారం..

ఈ సినిమా ప్రారంభమైన అర గంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట. అంతేకాదు.. అప్పటి నుంచి క్లైమాక్స్ రెబల్ స్టార్ అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉండబోతుందని చెబుతున్నారు. మరోవైపు అశ్వత్థామగా నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ .. సినిమా ప్రారంభమైన గంట తర్వాత ఎంట్రీ ఇస్తాడట. ఆయన పై చిత్రీ కరించిన ఫైట్స్ కూడా ఈ సినిమాకు స్పెషల్ గా నిలువనున్నాయి. మరోవైపు ప్రభాస్, అమతాబ్ మధ్య పోరాట సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడం గ్యారంటీ అని చెబుతున్నారు. దీపికా పదుకొణే పాత్ర కూడా ఈ సినిమాలో కీలకం. మరోవైపు

ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకులకు ఆశ్యర్యానికి లోనవుతారట. ఇక కల్కి మూవీలో కమల్ హాసన్ కేవలం నాలుగైదు సన్నివేశాల్లో  కనిపించనున్నారట. ఆయన ఉండే సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని టాక్. అంతేకాదు కమల్ హాసన్ పాత్రకు రెండో పార్ట్ లో ఎక్కువ సీన్స్ ఉండబోతున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

మొత్తంగా మూడు ప్రపంచాల మధ్య కొత్త ఊహా జనిత కథనానికి మన భారత ఇతిహాసాన్ని జోడిస్తూ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ తో ప్రభాస్.. బాహుబలి రేంజ్ హిట్ అందుకోవడం ఖాయం అని చెబుతున్నారు. ఈ సినిమా రన్ టైమ్ 180 నిమిషాల 56 సెకండ్స్ ఉంది. ఈ సినిమాలో   కాశీలో ఆర్జీవి ఓ కేఫే ఓనర్ గా చూపించారు.  రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వంటి వారి గెస్ట్ అప్పీరియర్స్ ఇచ్చారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ మెయిన్ హైలెట్. మొత్తంగా ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా $ 3 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఈ సినిమాకు వారం రోజులు పాటు ఎక్కువ టికెట్ రేట్స్ తో ఈ సినిమా ప్రదర్శనలకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసారు. ఇప్పటికే తెలంగాణలో రెండు గంటల్లోనే లక్షకు పైగా టికెట్స్ అమ్మడుపోయాయి. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులతో పాటు గత కొన్ని రోజులుగా డల్ గా బాక్సాఫీస్ కు కొత్త జోష్ తీసుకురావడం పక్కా అని చెబుతున్నారు.

Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News