Kalki 2898 AD: ఇదేక్కడి ట్విస్ట్ రా మావా.. రాజశేఖర్ కల్కి మూవీకి టికెట్లు హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగింది

Kalki Tickets: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా జూన్ 27న విడుదల కాబోతున్న.. సంగతి తెలిసిందే. అయితే 2019లో రాజశేఖర్ నటించిన కల్కి సినిమా కూడా ఇదే వారం విడుదల రీ-రిలీజ్ అవుతుంది. దీంతో ఈ రెండు సినిమాలకి కన్ఫ్యూజ్ అయ్యి.. అభిమానులు.. ప్రభాస్ కల్కి కాకుండా రాజశేఖర్.. సినిమా టికెట్లు బుక్ చేసుకున్నారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 24, 2024, 11:30 AM IST
Kalki 2898 AD:  ఇదేక్కడి ట్విస్ట్ రా మావా.. రాజశేఖర్ కల్కి మూవీకి టికెట్లు హౌస్‌ఫుల్.. ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగింది

Kalki Tickets Booking: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి సినిమా కోసం అభిమానులు ఎన్నో నెలల.. నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆరోజు.. త్వరలో రాబోతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా.. ఈ సినిమా విడుదల కాబోతోంది. 

ఈ నేపథ్యంలోనే టికెట్లు.. హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా.. ఇదే వారం 2019లో సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా.. ప్రశాంత్ వర్మ . దర్శకత్వంలో విడుదలైన కల్కి సినిమా కూడా రీరిలీజ్ అవుతుంది. అప్పట్లో ఈ సినిమా మంచి.. విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం అభిమానులు ప్రభాస్ కల్కి సినిమా అనుకొని రాజశేఖర్ కల్కి సినిమా టికెట్లు కొనుగోలు చేశారు. 

దీంతో కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో.. రాజశేఖర్ కల్కి సినిమా ఆరు షోస్ హౌస్ ఫుల్.. అయిపోయాయి. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీని గురించి రాజశేఖర్ కూడా తనదైన శైలిలో స్పందించారు. దీనికి తనకి ఎటువంటి సంబంధం.. లేదని జోక్ చేశారు.

"నాకు అసలు సంబంధం లేదు. జోక్స్ పక్కన పెడితే ప్రభాస్, నాగ్ అశ్విన్, మా వైజయంతి మూవీస్ అశ్విని దత్, సినిమా నటీనటులు చిత్ర బృందానికి నా అభినందనలు. సినిమాతో మీరు రికార్డులు సృష్టించి తెలుగు ఇండస్ట్రీని ఒక అడుగు ముందుకు తీసుకు వెళ్లాలని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు రాజశేఖర్. 

 

గంత కొంతకాలంగా రాజశేఖర్ సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్యనే 2023లో నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కనిపించిన రాజశేఖర్.. ఇంకా తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాల్సి ఉంది. 

మరోవైపు కల్కి 2898 ఏడి సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ నటీనటులు ఈ సినిమాలో కామియో పాత్రలలో కూడా కనిపించనున్నారు.

Also read: Karate Kalyani: కరాటే కల్యాణి హల్చల్.. రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్న నటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News