New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవే

New Vande Bharat Express: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. వందేభారత్ సేవలు మరో ప్రాంతానికి అందనున్నాయి. ఇకపై భీమవరంకు కూడా వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. వచ్చే నెల నుంచి ఆ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రూటు మారనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 25, 2024, 06:54 AM IST
New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవే

New Vande Bharat Express: ఏపీలో విజయవాడ-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూటు మారనుంది. వచ్చే నెల నుంచి భీమవరం వరకూ పొడిగించనున్నారు. ఇకపై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భీమవరం టు చెన్నై వయా విజయవాడ నడవనుంది. దీంతో పశ్చిమ వాసులకు కూడా వందేభారత్ సేవలు అందనున్నాయి. 

ఏపీలో ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు, సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఒక వందేభారత్ రైలు నడుస్తోంది. ఇవి కాకుండా విజయవాడ-చెన్నై మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు వచ్చే నెల నుంచి మరి కొంత దూరం విస్తరించనుంది. జూలై నుంచి విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భీమవరం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు చెన్నై రైల్వే అనుమతులిచ్చేసింది. టైమింగ్స్ షెడ్యూల్ ఒకటే మిగిలింది.

ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులో లేవు. రాజమండ్రి లేదా విజయవాడ వెళ్తేనే ఆ సేవలు లభిస్తాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తాడేపల్లిగూడెం లేదా ఏలూరు స్టాప్ ప్రతిపాదనకు రైల్వే శాఖ ఒప్పుకోలేదు. అదే సమయంలో చెన్నై-విజయవాడ వందేభారత్ రైలుకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచేందుకు ప్లాట్‌ఫామ్ సమస్యలు తలెత్తడం పశ్చిమవాసులకు వరంగా మారింది. ఈ రైలును భీమవరం వరకూ పొడిగించే ప్రతిపాదన రావడమే ఆలస్యం చెన్నై రైల్వే డివిజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ జూలై నుంచి భీమవరం-చెన్నై వయా విజయవాడ నడవనుంది.

ప్రస్తుతం చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం 5.30 గంలకు బయలుదేరి విజయవాడకు మద్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటోంది. తిరిగి మద్యాహ్నం 3.20 గంటలకు చెన్నైకు పయనమవుతుంది. అంటే 3.20  గంటల సమయం ఉంటుంది. ఇంతసేపు పగటి వేళ ప్రత్యేకంగా ప్లాట్‌ఫామ్ కేటాయించడం సమస్యగా మారింది. దాంతో విజయవాడ నుంచి భీమవరంకు రైలును పొడిగించాలనే ప్రతిపాదన వచ్చింది. ఎందుకంటే విజయవాడ-భీమవరం మద్య ప్రయాణ సమయం గంటే. అంటే చెన్నై నుంచి బయులుదేరే సమయంలో తేడా రాదు. మద్యాహ్నం 1.20 గంటలకు భీమవరం చేరుకునేలా షెడ్యూల్ కానుంది. ఇక భీమవరం నుంచి మద్యాహ్నం 2 గంటలకు బయలుదేరేలా సిద్ధం చేస్తున్నారు. రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. 

భీమవరం వ్యాపారపరంగా అభివృద్ది చెందిన పట్టణం కావడంతో వందేభారత్ రైలుకు ఆదరణ లభించవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. దీనికోసం భీమవరం విజయవాడ మద్య రైల్వే ట్రాక్ సామర్ధ్యం పునరుద్ధరణ పనులు కూడా పూర్తయ్యాయి.

Also read: Kerala Rename: కేరళంగా మారనున్న కేరళ, ఈసారైనా కేంద్రం పచ్చజెండా ఊపుతుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News