Tips for 10th Students: మార్చ్ 18, 2024 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రోజూ ఉదయం వేళ పరీక్షలు జరుగుతాయి. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరగనున్న పరీక్షల టైమ్ టేబుల్ కూడా విడుదలైంది. పూర్తి వివరాలు https://bse.telangana.gov.in/లో అందుబాటులో ఉన్నాయి.
పదవ తరగతి పరీక్షల టెన్షన్ జయించడం ఎలా
పదో తరగతి అనగానే సహజంగానే విద్యార్ధులకు ఓ విధమైన టెన్షన్ ఉంటుంది. చాలామంది విద్యార్ధులు టెన్షన్ వల్లనే పరీక్షలో తప్పులు చేస్తుంటారు. ఒక్కోసారి ఆ ఒత్తిడి కారణంగా చదివినవి, సమాధానం తెలిసిన ప్రశ్నలు కూడా మర్చిపోతుంటారు. తప్పులు చేస్తుంటారు. అందుకే పరీక్షల టెన్షన్ జయించేందుకు, పరీక్షల్ని సులభంగా గట్టెక్కేందుకు నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఇవి పాటిస్తే చాలావరకూ పరీక్షల టెన్షన్ తొలగడమే కాకుండా పరీక్షలు బాగా రాసేందుకు వీలవుతుంది.
ఎప్పుడూ చివరి నిమిషం వరకూ చదవడం చేయకూడదు. పరీక్షకు గంట ముందు బుక్స్ క్లోజ్ చేసి ప్రశాంతంగా ఉండండి. పరీక్ష ప్రారంభమైన వెంటనే ముందుగా తెలిసి ప్రశ్నలకు సమాధానాలు రాయండి, ప్రతి సమాధానం రాసేముందు ప్రశ్న కచ్చితంగా రాయండి. ప్రతి ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు చిన్న చిన్న పేరాల్లో, సబ్ హెడ్డింగ్స్, పాయింట్ల రూపంలో రాయాల్సి ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ బాగుండేట్టు చూసుకోండి. లేకపోతే ఇన్విజిలేషన్‌పై ప్రభావం పడవచ్చు.
పరీక్ష ప్రారంభమైన మొదటి గంటలో కనీసం 40-45 శాతం పరీక్ష పూర్తి కావాలి. మరో గంటలో 30-35 శాతం పరీక్ష పూర్తి కావాలి. మిగిలింది మిగిలిన సమయంలో పూర్తి చేస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. పరీక్షను చివరి నిమిషం వరకూ రాయకుండా 15-20 నిమిషాల ముందే క్లోజ్ చేస్తే..మరోసారి క్రాస్ చెక్ లేదా తెలియని ప్రశ్నలకు సమాధానం ఆలోచించేందుకు వీలుంటుంది.
పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్
మార్చ్ 18వ తేదీన మొదటి లాంగ్వేజ్
మార్చ్ 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 21వ తేదీన ఇంగ్లీషు
మార్చ్ 23న మేథ్స్
మార్చ్ 26వ తేదీన ఫిజికల్ సైన్స్
మార్చ్ 28న బయోలజీ
మార్చ్ 30న సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1న సంస్కృతం, అరబిక్, వొకేషనల్ కోర్స్ పరీక్షలు పేపర్ 1
ఏప్రిల్ 2న వొకేషనల్ కోర్సు పేపర్ 2 పరీక్షలు
Also read: TSPSC Group-1 Update: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook