Warangal Covid: వరంగల్‌లో కొవిడ్‌ కలవరం.. ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు పాజిటివ్!

Warangal Covid: తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 07:41 PM IST
Warangal Covid: వరంగల్‌లో కొవిడ్‌ కలవరం.. ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు పాజిటివ్!

Telangana Covid-19 Updates: తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా వరంగల్‌ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలో ఎంజీఎంలో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసి.. ఆ చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ ఆరుగురు చిన్నారులు వరంగల్ నగరానికి చెందినవారే. రీసెంట్ గా నీలోఫర్‌ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముఖ్యంగా చిన్నారుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 743 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్రారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 225 రోజుల తర్వాత ఇదే అథ్యధికం. ఒక్క మహారాష్ట్రలోని 129 కొత్త కేసులు వచ్చాయి. దేశంలో ప్రస్తుతం 3, 997 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  మహమ్మారి బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళ నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, తమిళనాడు, ఛత్తీస్ గఢ్ లో చెరో ఒక్కరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వింటర్ సీజన్ కావడంతో వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. 

మరోవైపు దేశంలో న్యూ వేరియంట్ అయిన జేఎన్. 1 వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కేసులు కూడా పదుల నుంచి వందల్లోకి వచ్చేశాయి. దీంతో జనాల్లో కలవరం మెుదలైంది. అయితే కొత్త వేరియంట్ తో భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే మాస్కులు ధరించి.. గుంపుల్లో తిరగకుండా ఉంటే మంచిదని సూచించింది. 

Also read: Ayodhya Railway Station: కొత్త ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్ ప్రారంభం.. అయోధ్య నగరికి కొత్త సొగసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News