దొంగల ముఠాతో చేతులు కలిపిన ఆరుగురు పోలీసులు స‌స్పెండ్

దొంగలను పట్టుకోవడం పోలీసుల డ్యూటీ. కానీ పట్టుకున్న దొంగలను వదిలేసి.. వాళ్ల చోరీల్లో వాటా పంచుకుంటే.. వాళ్లను ఏమనాలి ? ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. నగర శివార్లలోని మేడిపల్లిలో ఇటీవల డీజిల్ దొంగలు పోలీసులకు చిక్కారు. అయితే, అప్పుడు ఆ దొంగల వెనుకున్న పోలీసులు మాత్రం తాము ఎస్కేప్ అయ్యామనుకున్నారు.

Last Updated : May 31, 2020, 10:11 AM IST
దొంగల ముఠాతో చేతులు కలిపిన ఆరుగురు పోలీసులు స‌స్పెండ్

హైదరాబాద్ : దొంగలను పట్టుకోవడం పోలీసుల డ్యూటీ. కానీ పట్టుకున్న దొంగలను వదిలేసి.. వాళ్ల చోరీల్లో వాటా పంచుకుంటే.. వాళ్లను ఏమనాలి ? ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. నగర శివార్లలోని మేడిపల్లిలో ఇటీవల డీజిల్ దొంగలు పోలీసులకు చిక్కారు. అయితే, అప్పుడు ఆ దొంగల వెనుకున్న పోలీసులు మాత్రం తాము ఎస్కేప్ అయ్యామనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో దొంగలతో పాటు వారితో చేతులు కలిపిన కేడీ పోలీసుల బాగోతం కూడా బయటపడింది. పెట్రోల్ బంకులకు వెళ్లే డీజిల్ ట్యాంకర్ల నుంచి డీజీల్‌ని చోరీ చేసి.. ఆ డీజిల్‌ని అక్రమంగా అమ్ముకుంటున్న దొంగల ముఠాకు సహకరిస్తున్న పోలీసులపై ఎట్టకేలకు వేటు ప‌డింది. డీజిల్ చోరీ బ్యాచ్‌కు సహకరించిన ఆరుగురు పోలీసుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ సస్పెండ్ చేశారు.

Read also : Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డ ఈ లాజిక్‌ను ఎలా మిస్ అయ్యారు : ఏజీ సుబ్రహ్మణ్య శ్రీరామ్

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల18న మేడిపల్లిలో డీజీల్ చోరి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా ఆ ‌ముఠా సభ్యులను విచారిస్తుండగా.. ఆ దందాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసుల బండారం బయటపడింది. దీంతో దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలకు సహకరిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తంచేసిన రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్.. వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్ఓటీ ఇన్స్‌పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్‌తో పాటు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా సస్పెన్షన్‌కు గుర‌య్యారు. ముఠాకు సహకరించిన వారిని సస్పెండ్ చేస్తూ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News