Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌..రేపే అన్నదాతల ఖాతాల్లోకి సాయం..!

Rythu Bandhu: తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు(మంగళవారం) అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమకానుంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 27, 2022, 07:27 PM IST
  • తెలంగాణ రైతులకు శుభవార్త
  • రేపే రైతు బంధు సొమ్ము విడుదల
  • ఏర్పాట్లన్నీ పూర్తి
Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌..రేపే అన్నదాతల ఖాతాల్లోకి సాయం..!

Rythu Bandhu: తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు(మంగళవారం) అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమకానుంది. మొత్తం 68.10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతు బంధు కోసం ప్రభుత్వం రూ.7 వేల 521.80 కోట్లు కేటాయించింది. రోజూ ఒక ఎకరా నుంచి ఆరోహణ క్రమంలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. 

ఈక్రమంలోనే వ్యవసాయ శాఖకు సీసీఎల్‌ఏ వివరాలు అందించింది. ఎకరాల వారిగా బిల్లుల జాబితాను వ్యవసాయ శాఖకు ఆర్థిక శాఖ అందజేసింది. వానాకాలం రైతు బంధు నిధుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అధికారులు వెల్లడించారు. మొదటిసారి రైతు బంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను కలిసి పట్టాపాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

కేంద్రం ఎన్ని ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించినా రైతులకు సాయం అందిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని రైతులకు ఆయన సూచించారు. జూలై 15 వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈఏడాది సంవృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని..రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలని పిలుపునిచ్చారు. రైతు బంధు విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

Also read:Hyderabad Rains: హైదరాబాద్‌లో హైఅలర్ట్..ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ..!

Also read:Mamata Banerjee on Agnipath: దేశంలో చల్లారని అగ్నిపథ్‌ జ్వాలలు..మమతా బెనర్జీ ఏమన్నారంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News