Ragging in Kakatiya Medical college: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (Kakatiya Medical College)లో ర్యాగింగ్ (Ragging) కలకలం రేగింది. ఫ్రెషర్స్ డే పేరుతో మద్యం మత్తులో సీనియర్లు జూనియర్లను వేధిస్తున్నారంటూ ఓ విద్యార్థి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. 'రెడ్డి' అనే పేరుతో చేసిన ఆ ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా,మన్‌సుఖ్ మాండవీయా,తెలంగాణ మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖలను ట్యాగ్ చేశారు.
2017 బ్యాచ్‌కి సుమారు 50 మంది సీనియర్ మెడికోలు మద్యం తాగొచ్చి తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.. దయచేసి కాపాడాలని సదరు విద్యార్థి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. వరంగల్ (Warangal) కేఎంసీలోని న్యూమెన్స్ హాస్టల్-1లో ఈ ఘటన జరిగిందని తెలిపాడు. ఈ ట్వీట్ తీవ్ర కలకలం రేపడంతో వెంటనే స్థానిక మట్టెవాడ పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈ ఘటనపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాసు మాత్రం కాలేజీలో ర్యాగింగ్ (Ragging) ఘటన చోటు చేసుకోలేదని చెప్పడం గమనార్హం. జూనియర్ మెడికోల హాస్టల్‌కు, సీనియర్ మెడికోల హాస్టల్ భవనం దూరంగా ఉంటుందని చెప్పారు. సీనియర్లు కొంతమంది పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని... ఎవరో గిట్టనివారు దాన్నిలా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం(నవంబర్ 15) కేఎంసీలో ఫ్రెషర్స్ డే జరగాల్సి ఉంది. ర్యాగింగ్ కలకలంతో ఫ్రెషర్స్ డేకి (Freshers Day) ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ ఈ ఘటనపై తమకెవరూ ఫిర్యాదు చేయలేదని స్థానిక సీఐ గణేశ్ తెలిపారు.
Also Read: Cheating Case On Shilpa Shetty: ‘నా హక్కులను కాపాడండి’.. చీటింగ్ కేసుపై శిల్పాశెట్టి స్పందన
కాకతీయ మెడికల్ కాలేజీలో (College Students) గతంలోనూ ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉత్తరాదికి చెందిన ఓ బడా పారిశ్రామికవేత్త కుమార్తెను కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఆమెను తమ గదిలోకి తీసుకెళ్లి సీనియర్లు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe