Jharkhand Governor C.P. Radhakrishnan As Telangana’s Additional Governor: సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. తెలంగాణకు గవర్నర్ గా ఉన్న తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక.. తాజాగా, జార్ఖండ్ కు గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను తెలంగాణతోపాటు పుదుచ్చేరికి కూడా అదనపు గవర్నర్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులను జారీచేశారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో గవర్నర్‌ను నియమించే వరకూ రాధాకృష్ణనే గవర్నర్‌గా కొనసాగనున్నారు.
I am humbled and blessed to be given the additional responsibility to serve as the Governor of Telangana and Lieutenant Governor of Puducherry.
I thank from the bottom of my heart our beloved most respected Honourable President Smt. Droupadi Murmu Ji, our beloved most respected… pic.twitter.com/57hNukHNre— CP Radhakrishnan (@CPRGuv) March 19, 2024
ఇదిలా ఉండగా.. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను శ్రీమతి ద్రౌపది ముర్ము మార్చి 18న ఆమోదించారు. ఆమె తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ప్రజాసేవ చేయాలనేది నా కోరిక కాబట్టి నా స్వంత ఇష్టపూర్వకంగా రాజీనామా చేసినట్లు తమిళిసై వెల్లడించారు.
Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ , పుదుచ్చేరి అదనపు గవర్నర్ లుగా బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్ శ్రీమతి ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మాతృభూమికి సేవ చేయడానికి ఈ గొప్ప అదనపు బాధ్యతను నాకు ఇచ్చినందుకు అత్యంత గౌరవనీయమైన గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీ, ప్రధానమంత్రి శ్రీ @narendramodi జీ, గౌరవనీయులైన హోంమంత్రి శ్రీ @AmitShah జీకి నా హృదయపూర్వక ధన్యవాదాలని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook