ప్రధాని స్తాయి వ్యక్తి ఓ ఎంపీకి విష్ చేయడమేంటి.. అది కూడా తెలుగులో చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ... ఇంతకీ అంత అదృష్టం చేసుకున్న ఆ ఎంపీ ఎవరనేది దానిపై ఉత్కంఠంగా కదూ.. అసలు విషయం ఏమిటంటే ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆమెకు విష్ చేశారు. అయితే వీటిలో ప్రధాని మోడీ చేసిన విష్ ప్రత్యేకంగా నిలిచింది.
మోడీ విషెస్ మీరూ చదవండి
‘మీ బర్త్ డే సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకరమైన, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుతున్నాను.’ అంటూ ప్రధాని మోదీ తెలుగులోనే ఎంపీ కవిత కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రధాని మోడీ తెలిపిన ఈ తెలుగు విషె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
PM Modi wished TRS MP K.Kavitha in Telugu on her birthday. The note reads, 'On the account of your birthday accept my hearty wishes. I wish God gives you the health and happiness needed to serve the country's people.' pic.twitter.com/yLhuOksbax
— ANI (@ANI) March 13, 2018
స్వపక్షమైనా..విపక్షమైనా అంతా ఒకటే
ప్రధాని స్థాయి వ్యక్తి ఓ ఎంపికి ఇలా ప్రత్యేకంగా విష్ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీకి ఇలా విష్ చేయడం మరో విశేషం. విపక్ష పార్టీలు, నేతల పట్ల తన హుందాతనాన్ని మోడీ ఈ విధంగా చాటాలనుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
తెలగు భాష, నేతల పట్ల తన గౌరవాన్ని చాటుకున్న మోడీ
కల్వకుంట్ల కవితకు ప్రధాని మోడీ తెలిపిన విష్ తెలుగులోనే ఉండటం... తెలగు ప్రజల పట్ల, తెలువారి పట్ల గౌవరాన్ని చాటేందుకు మోడీ ఇలా తెలుగులో విష్ చేసినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
హుందా తనమే కవిత ప్రత్యేకత
గత నాలుగేళ్ల నుంచి పార్లమెంట్ లో తనదైన శైలిలో ప్రజా సమస్యలను తీసుకెళ్తూ..సభలో హుందాగా వ్యవహరించడం వంటి లక్షణాలే కవితకు ఈ స్థాయి దక్కిందని..అందుకే ప్రధాని స్థాయి వ్యక్తి .. ఆమెకు తెలుగులో విష్ చేశారని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.