హైదరాబాద్ : ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ఆపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతి ఇంటికి వచ్చి తనిఖీ చేయలేదని, ప్రతి పౌరుడు దీనిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో జరిగిన మనీపవర్ ఇన్ ఎలక్షన్స్ అనే సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వర్తమాన కాలంలో ప్రజల్లో మానసిక విప్లవం రావాలని, మారాల్సింది ప్రజలేనని, వ్యవస్థ కాదని ఆయన అన్నారు.
రాజకీయ నాయకులు ఓట్లు కొంటున్నారని, ప్రజలు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని, తిరిగి అధికారంలోకి వచ్చాక అవినీతి పాల్పడుతున్నారని అన్నారు. పార్టీలు, నాయకులు ఎన్నికల ముందు అన్నీ ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తారని, ఎన్నికలయ్యాక చేతులేత్తెస్తారని ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..