Pawan Kalyan Tour: జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల!

JanaSena Chief Pawan Kalyan's Telangana Tour Route Map Released. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రూట్ మ్యాప్‌ ఇదే.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 22, 2023, 09:07 PM IST
  • జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
  • రూట్ మ్యాప్ విడుదల
  • వారాహికి ప్రచార రథంకు పూజలు
Pawan Kalyan Tour: జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల!

JanaSena Chief Pawan Kalyan's Telangana Tour Route Map Released: మంగళవారం (జనవరి 24) జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకుసంబందించిన రూట్ మ్యాప్‌ను తాజాగా జనసేన నేతలు విడుదల చేశారు. జనవరి 24న ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి కొండగట్టు చేరుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజ చేస్తారు. ఆపై వారాహికి ప్రచార రథంకు పూజలు చేసి, జనసేన నేతలతో సమావేశం అవుతారు. జనసేన అధినేత పవన్ జగిత్యాల జిల్లా రూట్ మ్యాప్ వివరాలు ఇలా ఉన్నాయి. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 24న హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి వాహనంకు పూజ చేస్తారు. ఆపై మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారులోని ఓ రిసార్టులో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు. 

అదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో జనసేన అధినేత సమావేశం అవుతారు. పార్టీ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారు. 

Also Read: India ICC ODI Ranking: న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలిస్తే.. టీమిండియాదే అగ్రస్థానం!  

Also Read: Mercury Venus Conjunction: అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశి వారికి వివాహం జరుగుతుంది! ప్రభుత్వ ఉద్యోగం పక్కా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News