Omicron Variant BA.4: హైదరాబాద్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బిఎ. 4 కేసు.. దేశంలోనే తొలి కేసుగా గుర్తింపు

Omicron Variant BA.4 in Hyderabad: ఒమిక్రాన్‌కి చెందిన సబ్ వేరియంట్ బిఎ 4 తొలి కేసు హైదరాబాద్‌లో నమోదైంది. దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 కేసుగా తెలుస్తోంది. ఆఫ్రికా నుంచి వచ్చిన సదరు వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 12:49 AM IST
Omicron Variant BA.4:  హైదరాబాద్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బిఎ. 4 కేసు.. దేశంలోనే తొలి కేసుగా గుర్తింపు

Omicron Variant BA.4 in Hyderabad: ఒమిక్రాన్‌కి చెందిన సబ్ వేరియంట్ బిఎ 4 తొలి కేసు హైదరాబాద్‌లో నమోదైంది. దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 కేసుగా తెలుస్తోంది. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌కి రాగా.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జరిపిన వైద్య పరీక్షల్లో అతడికి ఈ సబ్ వేరియంట్ సోకినట్టు సమాచారం. అయితే, అతడికి లక్షణాలు లేకపోవడంతో తిరిగి ఈనెల 16వ తేదీనే అతడు ఆఫ్రికా వెళ్లిపోయాడు. 

ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తించినది ఒమిక్రాన్‌కి సబ్ వేరియంట్ బిఎ 4 అవునో కాదో అనే విషయం నిర్ధారించుకునేందుకు అతడి శాంపిల్స్‌ని ఇండియన్ సార్స్-కొవిడ్ 2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ (ఇన్సాకోగ్)కి పంపించారు. ప్రస్తుతం కన్సార్టియం నుంచి నివేదిక రావాల్సి ఉంది. కన్సార్టియం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఈ సబ్‌వేరియంట్ కేసుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. 

ఇదిలావుంటే, ఆఫ్రికా నుంచి వచ్చిన సదరు వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ4 కేసు (Omicron Variants) గురించి ఇప్పటి వరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

Also read : Omicron XE Variant: ఇది మరీ ప్రమాదకరమా..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Also read : Omicron Symptoms in Kids : చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా కరోనానే!

Trending News