Nagababu: నాగార్జున కు బిగ్ షాక్.. హైడ్రాపై సీఎం రేవంత్ ను పొగుడుతూ సంచలన ట్విట్ చేసిన నాగబాబు..

Hydra demolishes: తెలంగాణలో  కొన్నిరోజులుగా హైడ్రా  హల్ చల్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఎవరి నోట్లో విన్న కూడా హైడ్రా అనే పదం ఎక్కువగా విన్పిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా నాగాబాబు కొణిదేల హైడ్రాపై ప్రశంసలు కురిపించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 1, 2024, 06:48 PM IST
  • నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలు..
  • సీఎం రేవంత్ హైడ్రా సూపర్ అన్న నాగబాబు..
Nagababu: నాగార్జున కు బిగ్ షాక్.. హైడ్రాపై సీఎం రేవంత్ ను పొగుడుతూ  సంచలన ట్విట్ చేసిన నాగబాబు..

Nagababau konidela on hydra demolish concept: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన స్టైల్ లో పాలన అందిస్తున్నారు. ఒకవైపున ఆరుగ్యారంటీల పథకం అమలు చేయడం కోసం చర్యలు తీసుకుంటునే.. మరోవైపు గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అక్రమాలను  కూడా ప్రజల ముందు ఉంచుతున్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా అంటే.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీని కోసం ప్రత్యేకంగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రంగనాథ్ ను కూడా కమిషనర్ గా నియమించారు.

 

ఇటీవల సీఎం రేవంత్ కూడా హైడ్రాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని, బఫర్ జోన్ లను వదిలేయకుండా అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారిని వదలడంలేదు. ప్రతి ఒక్క అక్రమ నిర్మాణాల్ని పడగొడుతున్నారు. ఇటీవల హీరో నాగార్జునకు  సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను సైతం హైడ్రా పడగొట్టేసింది. అంతేకాకుండా.. ఇటీవల హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాల్ని పడగొట్టిన అధికారులు, ఇప్పుడిక అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా.. ఆరుగురు అధికారులపై హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు ఏకంగా క్రిమినల్ కేసులు సైతం నమోదు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా.. హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని కూడా సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు అని తెలితే.. తన వాళ్లు, పరాయివాళ్లు అని తేడాలేకుండా కూల్చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ తెల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజల నుంచి కూడా హైడ్రా పట్ల మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

 తాజాగా, నాగబాబు కొణిదేలా ఎక్స్ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి  హైడ్రా కాన్సెప్ట్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం భారీ వర్షం ముంచెత్తుంది. ఎక్కడ చూసిన కూడా వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు తూములు తెగిపోయి ఇళ్లలోనికి నీరు వచ్చి చేరుతుంది. చాలా మంది అమాయకులు చనిపోయారు. వీటికి కారణం.. నాళాలు, చెరువుల్ని ఆక్రమించడమేనని ఆయన అన్నారు.

Read more: Polala Amavasya 2024: ఎడ్ల పొలాల అమావాస్య ఎప్పుడు..?.. ఈ పండుగ విశిష్టత.. ఈరోజున ఎద్దులను ఎందుకు ఊరేగిస్తారంటే..?

ఇది బాధకరమంటునే.. ఈ నేథ్యంలో ... మనం ప్రకృతిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని, మనం దానికి ఆపద కల్గేలా ప్రవర్తిస్తే. మనల్ని కూడా అదే విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని కూడా నాగబాబు కొణిదేల అన్నారు. అందుకే ప్రకృతిని మనం కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని, మనం ప్రకృతిని భక్షిస్తే.. అది మనల్ని శిక్షిస్తుందని నాగబాబు కొణిదేలా అన్నారు. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ సూపర్ అంటూ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News