Munugode Bypoll: ఒక్కో అకౌంట్ కు 15 నుంచి 50 లక్షలు... మునుగోడు ఓటర్లరా మీకు డబ్బులు వచ్చాయా?

Munugode Bypoll:మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి తన సుశీ ఇన ఫ్రా సంస్థ నుంచి భారీగా నగదును మునుగోడు నియోజకవర్గంలోని పలువురు వ్యక్తులకు ట్రాన్స్ ఫర్ చేశారని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధారాలను సమర్పించింది.

Written by - Srisailam | Last Updated : Oct 30, 2022, 11:27 AM IST
Munugode Bypoll: ఒక్కో అకౌంట్ కు 15 నుంచి 50 లక్షలు... మునుగోడు ఓటర్లరా మీకు డబ్బులు వచ్చాయా?

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొలది అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగాలు చేశారంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మంత్రి జగదీశ్ రెడ్డిపై యాక్షన్ తీసుకుంది. 48 గంటల పాటు ఆయన ప్రచాపం చేయకుండా నిషేదం విధించింది. తాజాగా మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి తన సుశీ ఇన ఫ్రా సంస్థ నుంచి భారీగా నగదును మునుగోడు నియోజకవర్గంలోని పలువురు వ్యక్తులకు ట్రాన్స్ ఫర్ చేశారని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధారాలను సమర్పించింది.

రాజగోపాల్‌రెడ్డి సంస్థ నుంచి దాదాపు రూ.5.22 కోట్లు స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 23 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని, ఆ డబ్బంతా మునుగోడు ఉప ఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ఆరోపించింది. ఖాతాల నుంచి డబ్బులు తీసుకోకముందే ఆయా వక్తులకు సంబంధించిన 23 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కోరింది. ఓటర్లకు పంపిణీ చేసేందుకే భారీగా నగదును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల వేళ ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని చెప్పారు.ప్రజాస్వామ్యంలో ఈ తరహా చర్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే రాజగోపాల్‌రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేతలు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థ నుంచి నగదు బదిలీ అయిన బ్యాంక్ అకౌంట్లు ఇవే అంటూ టీఆర్ఎస్ రిలీజ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలు చూసి జనాలు షాకయ్యారు. టీఆర్ఎస్ విడుదల చేసిన లిస్టులో 23 మంది బ్యాంక్ అకౌంట్లు ఉండగా.. అందులో 20 మంది చౌటుప్పల్ మండలానికి చెందిన వారే. మిగిలిన ముగ్గురు మర్రిగూడ మండలానికి చెందిన వారు. టీఆర్ఎస్ చేసిన ఈ ఆరోపణలు కలకలం రేపాయి. టీఆర్ఎస్ విడుదల చేసిన జాబితా ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా నుంచి నిధులు వెళ్లినవారి వివరాలు..

 పబ్బు రాజు గౌడ్‌  కుటుంబం ఖాతాలో మొత్తం రూ.1.5 కోట్లు

 నీల మహేశ్వర్‌ ఖాతాలో రూ.50 లక్షలు

 నీల మహేశ్వర్ కు చెందిన  అక్షయ సీడ్స్‌, ఫెర్టిలైజర్స్‌ ఖాతాలో రూ. 25 లక్షలు

 ఉబ్బు సాయికిరణ్‌ ఖాతాలో రూ.16 లక్షలు

 కాసర్ల విష్ణువర్ధన్‌రెడ్డి ఖాతాలో 16 లక్షలు

 కాసర్ల విజయవర్ధన్‌రెడ్డి ఖాతాలో 16 లక్షలు

దిండు భాస్కర్‌ అకౌంట్‌లో రూ.16 లక్షలు

దిండు యాదయ్య ఖాతాలో రూ.16 లక్షలు

దిండు మహేశ్‌ అకౌంట్ లో 16 లక్షలు

చింతల మేఘనాథ్‌రెడ్డి అకౌంట్‌లో  రూ.40 లక్షలు

పోలోజు రాజ్‌కమల్‌ ఖాతాలో రూ.16 లక్షలు

డీ దయాకర్‌రెడ్డి ఖాతాలో రూ.16 లక్షలు

 శ్రీనివాస టెంట్‌ హౌజ్‌ ఖాతాలో రూ.16 లక్షలు

బుర్ర శివకుమార్‌  ఖాతాలో రూ.16 లక్షలు

మరోవైపు తమ ఖాతాల్లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థ నుంచి నగదు వచ్చిందనే వార్తలను పబ్బు రాజు గౌడ్ ఖండించారు. అక్టోబర్ నెలలో తమ ఖాతాలోకి ఎలాంటి పెద్ద నగదు ట్రాన్స్ ఫర్ కాలేదన్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన తన బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ ను ఆయన విడుదల చేశారు. తన భార్య పబ్బు అరుణ అకౌంట్లోకి కూడా నగదు రాలేదన్నారు. ఫేక్ వార్తలతో కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని చెబుతున్నారు.

 

Read Also: Rahul Gandhi Bharath Jodo Yatra: రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ రన్నింగ్ రేస్.. ఎవరు గెలిచారంటే..?

Read Also: Pranitha Subhash Latest Photoshoot : ప్రణీత.. ఏంటీ అందాల ఆరబోత.. తల్లైనా తగ్గేదేలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News