Chevella Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. ఆరుగురు దుర్మరణం

Chevella Road Accident Latest Updates: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 2, 2024, 06:18 PM IST
Chevella Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైతులపై దూసుళ్లిన లారీ.. ఆరుగురు దుర్మరణం

Chevella Road Accident Latest Updates: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండల పరిధిలోని ఆర్డర్ గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్మే  రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది చిరువ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఘటనాస్థలంలో భీతావాహ పరిస్థితి నెలకొంది. 

గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ అదుపుతప్పడం వంద మీటర్ల నుంచే కురగాయల వ్యాపారులు గుర్తించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులపై దూసుకెళ్లింది. దీంతో ఓ చెట్టు కూలిపోయింది. పోలీసులు కూలిన చెట్టును పక్కకు తొలగించారు.

Trending News