Fire Accident in Hyderabad's Attapur: హైదరాబాద్ లోని వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తాపూర్ ప్రాంతంలోని కట్టెల గోదాంలో మంటలు ఎగసిపడ్డాయి. అందులో ఎక్కువగా కలప ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. ఘటనాస్థలికి దగ్గరలోనే మదర్సా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారులతోపాటు పలువురిని బయటకు పంపించేశారు. పక్కనే ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతానికి విద్యుత్తును కట్ చేశారు.
గోదాంను అనుకుని టింబర్ డిపో ఉండటంతో మంటలు వ్యాప్తి ఎక్కువ అవుతుందోనని అధికారులు ఆందోళన చెందారు. ఎనిమిది అగ్నిమాపక శకటాలతో ఫైర్ సిబ్బంది 4 గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియరాలేదు. అనుమతులు లేని గోదాంలను మూసివేయడం లేదా ఇతర ప్రాంతాలకు తరలించడమోచ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల కిందటే పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కూలర్ల తయారీ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయపెడుతున్నాయి.
Also Read: BRS Posters: బీజేపీపై విమర్శలు పెంచిన బీఆర్ఎస్, దాడులపై నగరంలో వ్యంగ్య పోస్టర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook