కేసీఆర్‌కి గుడి కట్టి జేబులో ఫొటో పెట్టుకుంటా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సీఎం కేసీఆర్‌పై చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన లక్ష్మీదేవిపల్లి జలసాధన సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊరికి సీఎం కేసీఆర్ నీళ్లు అందిస్తే ఆయనకు గుడి కట్టించడమే కాకుండా ఆయన ఫోటోను కూడా జేబులో పెట్టుకు తిరుగుతానని కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. 

Last Updated : Sep 1, 2019, 08:25 PM IST
కేసీఆర్‌కి గుడి కట్టి జేబులో ఫొటో పెట్టుకుంటా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్: సీఎం కేసీఆర్‌పై చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన లక్ష్మీదేవిపల్లి జలసాధన సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊరికి సీఎం కేసీఆర్ నీళ్లు అందిస్తే ఆయనకు గుడి కట్టించడమే కాకుండా ఆయన ఫోటోను కూడా జేబులో పెట్టుకు తిరుగుతానని కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. 

గతంలో కొల్లాపూర్‌ సభలో కేసీఆర్ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి... "ఆనాటి సభలో సీఎం కేసీఆర్ ఓ పెద్ద మాట ఇచ్చారని.. వచ్చే ఖరీఫ్ నాటికి రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టు ప్రారంభమవుతుందన్నారు. రెండు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు" అంటూ కేసీఆర్ మాటిచ్చారని అన్నారు. అందుకే దేవుడు నీళ్లు ఇవ్వకున్నా.. కేసీఆర్ దేవుడు సాగు నీళ్లు ఇస్తారని చెబుతూ.. కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకుంటే రెండు, మూడు మృగశిరల తర్వాత తాను సీఎం కేసీఆర్‌కి గుడి కట్టడమే కాకుండా జేబులో ఆయన ఫొటో కూడా పెట్టుకుంటా" అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇకపై మృగశిర కార్తి కాకుండా చంద్రశిర కార్తి పండగలా చేసుకుందామని కొండా ఛలోక్తులు విసిరారు.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చేవెళ్ల ఎంపీగా పోటీచేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి... ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలకు ముందుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల ఎంపీగా పోటీచేసిన కొండా టీఆర్ఎస్ అభ్యర్తి జి రంజిత్ రెడ్డి చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Trending News