Karnataka MLA Slaps Youth: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట రమణప్ప ఓ సామాన్య యువకుడి చెంప చెల్లుమనిపించాడు. తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరినందుకు అందరి ముందే యువకుడిని చెంప దెబ్బ కొట్టాడు. తూమకూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతంసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. తూమకూరు జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పావగడ ఎమ్మెల్యే వెంకట రమణప్ప హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి బయలుదేరే సమయంలో కొంతమంది యువకులు ఎమ్మెల్యే వద్దకు వచ్చారు. అందులో నరసింహా మూర్తి అనే యువకుడు తమ గ్రామానికి తాగు నీరు, రోడ్లు సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యేను కోరాడు.
అంతే.. ఎమ్మెల్యే వెంకట రమణప్ప ఆగ్రహంతో ఆ యువకుడిపై చేయి చేసుకున్నాడు. అంతేకాదు, జైల్లో పెట్టిస్తా అంటూ యువకుడిని ఎమ్మెల్యే హెచ్చరించినట్లు చెబుతున్నారు. అనంతరం ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది యువకుడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
బీజేపీ జాతీయ ఐటీ సెల్ విభాగం ఇన్‌చార్జి అమిత్ మాళవియా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. గతంలో మాజీ సీఎం సిద్దరామయ్య, ప్రస్తుత కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను పబ్లిక్‌లో కొట్టారని... ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ యువకుడిని పబ్లిక్‌లో కొట్టాడని పేర్కొన్నారు. గతంలో అమేథీకి చెందిన ఓ యువకుడు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరినందుకు అతన్ని రాహుల్ బీజేపీలో చేరాలన్నాడని గుర్తుచేశారు.
In Karnataka, Venkataramanappa, Congress MLA from Pavagada, slaps a youth who asked for road in his village.
After Siddaramaiah and DKS slapping Congress workers in public, this is a new low.
Reminds us of Amethi, where Rahul asked a young man demanding road to join the BJP. pic.twitter.com/XhYeldhZII
— Amit Malviya (@amitmalviya) April 21, 2022
మరోవైపు, చెంప దెబ్బ ఘటనపై ఎమ్మెల్యే వెంకట రమణప్ప వివరణ ఇచ్చుకున్నారు. ఆ యువకుడు తనతో పదేపదే అభ్యంతరకరంగా మాట్లాడినందువల్లే చెంప దెబ్బ కొట్టాల్సి వచ్చిందన్నారు. అంతేకాదు, అతని మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. ఇక రోడ్ల గురించి మాట్లాడుతూ... అన్నింటినీ ఒకే రాత్రి బాగు చేయడం సాధ్యం కాదన్నారు.
Also Read: Delhi Covid Cases: ఢిల్లీలో కొత్త వేరియంట్ కలకలం... కేసుల పెరుగుదలకు అదే కారణమా...?
Also Red: Pan masala Star: పాన్‌మసాల స్టార్స్ అంటు పోస్ట్‌లు..సోషల్ మీడియాలో తెగ వైరల్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.