దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి : అసదుద్దీన్ ఓవైసీ

కేసీఆర్‌పై అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు

Last Updated : Dec 11, 2018, 05:46 PM IST
దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి : అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించే అర్హతలు, సత్తా కేసీఆర్‌కు వున్నాయని అన్నారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ప్రస్తుతం దేశానికి కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కేసీఆర్ మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతారు అని ఓవైసీ ఆశాభావం వ్యక్తంచేశారు. తాను కేసీఆర్‌ను చాలా దగ్గరి నుంచి చూసిన అనుభవంతో చెబుతున్నాను... దేశానికి అటువంటి నాయకుడు కావాలి. ఇకపై కేసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయంలో విజయం సాధించాలని కోరుకోవడమే కాకుండా అతడి అడుగులో అడుగు వేస్తానని ఓవైసీ తెలిపారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News