IT Raids On Excel Group Of Companies: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడులు మొదలయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే అధికారులు దాడులు మొదలు పెట్టడం కలకలం రేపుతోంది. 20 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్సెల్ కంపెనీకి చెందిన బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో బాచుపల్లి, చందా నగర్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెల్లవారుజామున ఆరు గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. 40 కార్లు, 3 సీఆర్పీఎఫ్ బస్సులలో 20 బృందాలు బయలుదేరి వెళ్లాయి. ఒకేసారి భారీగా వాహనాలతో ఐటీ అధికారులు బయటకు రావడంతో ఇంకా ఎక్కడెక్కడ దాడులు జరుగుతాయోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఐటీ దాడులు అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డితో పాటు ఇతర ప్రముఖుల ఇళ్లలో దాడులు నిర్వహించడం తెలంగాణలో సంచలనం రేపింది. తాజాగా మరోసారి భారీగా ఐటీ అధికారులు బయటకు రావడంతో ఎవరిపై ఇళ్లపై దాడులు జరుగుతాయోనని బడా వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.
వరుసగా హైదరాబాద్‌లో ఐటీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతున్న వేళ ఐటీ రైడ్స్ మొదలుపెట్టడంతో రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రతి నగరంలోనూ ఎక్కడో ఒక్కచోట ఐటీ దాడులు జరుగుతుండడం.. అది కూడా ఆయా రాష్ట్రల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
Also Read: AP Politics: ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో గుబులు.. ఎవరికి నష్టం..?
Also Read: ATM Withdrawal: ఈ ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 చేతికి.. ఎగబడ్డ జనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook