Minor Girl Gang Rape: మైనర్ బాలిక కారు వీడియో ఎలా లీకైంది.. రఘునందన్ కు పంపింది ఎవరు?

Hyderabad Gang Rape Update: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో అన్ని సంచలనాలే వెలుగు చూస్తున్నాయి. కేసు గంటకో మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ పోలీసులకు ప్రతిష్టకు మచ్చగా మారుతోంది.

Written by - Srisailam | Last Updated : Jun 5, 2022, 07:41 AM IST
  • గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామాలు
  • రఘునందన్ కు ఆ వీడియో ఎలా వచ్చింది?
  • వీడియో లీక్ పై పోలీసుల విచారణ
Minor Girl Gang Rape: మైనర్ బాలిక కారు వీడియో ఎలా లీకైంది.. రఘునందన్ కు పంపింది ఎవరు?

Hyderabad Gang Rape Update: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో అన్ని సంచలనాలే వెలుగు చూస్తున్నాయి. కేసు గంటకో మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ పోలీసులకు ప్రతిష్టకు మచ్చగా మారుతోంది. గ్యాంగ్ రేప్ ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వచ్చాయి. కాని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే ఈ కేసులో ఎంఐఎం కొడుకు ఉన్నారని గట్టిగా వాదిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. సంచలన ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. అందులో మైనర్ బాలికతో పాటు నలుగురు యువకులు కారులో వెళుతున్నారు. అందులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారని రఘునందన్ రావు ఆధారాలు బయటపెట్టారు.

ఎమ్మెల్యే రఘునందన్ విడుదల చేసిన వీడియోలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలు... కారులో మరో యువకుడితో అసభ్యకర స్థితిలో కనిపిస్తోంది. కారులో మరో ముగ్గురు ఉండగానే బాధితురాలు, యువకుడు ఘాటుగా ముద్దులు పెట్టుకుంటున్నారు. రఘునందన్ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సంచలనమైంది. కేసులో మరింత హీట్ రాజేసింది. రఘునందన్ రావు ఫోటోలు, వీడియోలు విడుదల చేయడంతో పోలీసులు షాకయ్యారు. వెస్డ్ జోన్ పోలీసులైతే ఉలిక్కిపడ్డారు. ఆ వీడియోను పరిశీలిస్తే కారులో ఉన్న వ్యక్తికే ఆ విజువల్స్ తీసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అంటే గ్యాంగ్ రేప్ బాధితురాలితో పాటు కారులో వెళ్లిన యువకుల్లోనే ఎవరో ఒకరు ఈ వీడియో తీసి ఉంటారు. అలాంటి వీడియో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఎలా చేరింది అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.  

గ్యాంగ్ రేప్ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో వెళ్లిన యువకులు కూడా ఇందులో ఉన్నారు. అంటే పోలీసులకు పట్టుబడిన నిందితుల్లోనే ఒకరి మొబైల్ లో ఈ వీడియో ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో నిందితుడి ఫోన్ లో ఉన్న వీడియో.. పోలీసుల ద్వారానే లీకైందనే అనుమానాలు వస్తున్నాయి. ఎవరో ఒక పోలీసే... మైనర్ బాలికతో పాటు నలుగురు నిందితులు కారులో వెళ్లిన వీడియోను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు పంపించారని భావిస్తున్నారు. అందుకే కారు వీడియో బయటికి వచ్చిన వెంటనే హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులంతా షేకయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్బీ , లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులతో పాటు పలువురు హుటాహుటిన సమావేశమయ్యారు. నిందితుల వీడియోలు, ఫోటోలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఈ వీడియోలు ఎలా చేరాయనే దానిపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీడియో లీక్ చేసిన వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read also: Punjab Murder: పంజాబ్‌లో మరో దారుణం, నడిరోడ్డుపై...అందరూ చూస్తుండగా యువకుడి హత్య

Read also: Pub Minor Rape Case: వణికిస్తోన్న హైదరాబాద్‌ పబ్‌లు - సంపన్నుల పిల్లల అరాచకాలు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News