Traffic Challan: మూడవ కన్ను అంటే కెమేరా నిఘా అందుబాటులో వచ్చినప్పటి నుంచి వాహనాలపై చలానాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే పెండింగ్ చలాన్లు కూడా. ఆ బైక్ పై ఉన్న చలాన్లు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన పెరిగిపోతోంది. ముఖ్యంగా కెమేరా నిఘా వచ్చిన తరువాత మరీ ఎక్కువైపోయింది. ఏ మాత్రం క్రాస్ చేసినా..కెమేరా స్కాన్‌లో దొరికిపోతున్నారు. వాహనంపై ఆటోమేటిక్‌గా చలానాలు ఇష్యూ అయిపోతున్నాయి. దాంతో వాహనదారుడికి తెలియకుండానే చలాన్లు పడిపోతున్నాయి. ఎప్పుడైనా తెలిసి చెల్లించే పరిస్థితి వచ్చినప్పుడు చూసుకుంటే అవాక్కవాల్సి వస్తుంది. అటు పోలీసులకు కూడా ఇదే పరిస్థితి. ఏదైనా వాహనాన్ని పట్టుకున్నప్పుడు చలానా స్టేటస్ చూసి ముక్కున వేళేసుకుంటున్నారు.
నగరంలో సగానికి పైగా జనం సక్రమంగా చలాన్లు చెల్లించడం లేదు. అటు ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) కూడా నిబంధనల ఉల్లంఘన పేరుతో..దొరికితే మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వాహన తనీఖీల్లో ఓ బైక్ చలాన్లు చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. ట్రాఫిక్ పోలీసుల్ని చూసి దూరం నుంచే ఓ వ్యక్తి బైక్ వదిలి పారిపోయాడు. ఆ బండి నెంబర్ AP 23 M 9895. బండిపై ఉన్న చలాన్లను పరిశీలించగా..ఏకంగా 179 చలాన్లు(Traffic Challans)ఉన్నట్టు తేలింది. చలాన్ల మొత్తం చూస్తే...42 వేల 475 రూపాయలు. ఆ చలాన్లు కట్టేకంటే కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చేమో. బహుశా ఆ వాహనదారుడు కూడా అందుకే ఆ బైక్ వదిలి పారిపోయాడు.
Also read: Ireland to Srikakulam: ఐర్లాండ్ నుంచి శ్రీకాకుళం వరకూ..ఏపీలో ఇప్పుుడు ఒమిక్రాన్ ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook