Govt Holidays: తెలంగాణ ప్రజలకు శుభవార్త. రెండు రోజులు సెలవులు రానున్నాయి. ముస్లింల పవిత్ర పర్వదినం సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బక్రీద్ పర్వదినంతోపాటు ఆ తదనంతరం వారం ఆ వర్గానికి ప్రత్యేకమైన రోజు కావడంతో రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ అధికారులు ప్రకటన విడుదల చేశారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 17వ తేదీన సెలవు ప్రకటించారు. అయితే బక్రీద్ ఎప్పుడు చేసుకుంటారనేది స్పష్టత లేకపోవడంతో 17 లేదా 18వ తేదీన సెలవు ప్రకటించే వీలు కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే 17వ తేదీని సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు జూన్ 25వ తేదీన ఈద్-ఏ-గదీర్ సందర్భంగా కూడా ప్రభుత్వం సెలవు ఇచ్చింది.
Also Read: Exit Polls KCR: గెలిచినా.. ఓడినా తెలంగాణ రక్షణ కవచం బీఆర్‌ఎస్ పార్టీ
ఇస్లాం క్యాలెండర్ ప్రకారం సెలవుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. వాస్తవంగా చందమామ కనిపించిన మరుసటి రోజు పండుగలు చేసుకోవడం ఇస్లాం మతాచారం. ఈ నేపథ్యంలో బక్రీద్ సమయంలో చాంద్ ఎప్పుడూ కనిపిస్తే ఆ రోజు ముస్లిం సంఘాలు పర్వదినం ఎప్పుడు చేసుకోవాలో చెబుతాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వం బక్రీద్‌కు సెలవు ప్రకటించనుంది. ఆంగ్ల కాలమానం ప్రకారం 17న బక్రీద్ రాగా.. ఇస్లాం మతాచారం ప్రకారం ఈ తేదీలో మార్పు ఉండవచ్చు.
Also Read: KCR: ఉద్యమ కాలాన్ని తలచుకుని కేసీఆర్ భావోద్వేగం.. ఆవిర్భావ వేడుకల్లో ఉద్విగ్న సన్నివేశం
మార్కెట్ సిద్ధం
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ రోజు ముస్లింలు సేవా, సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రత్యేకంగా మేకలు, పొట్టేలు వంటివి బలి ఇస్తుంటారు. బక్రీద్‌ను తెలంగాణలో ఘనంగా చేసుకుంటారు. హైదరాబాద్‌లో మరింత ఘనంగా చేసుకుంటుండడంతో ఆ రోజు సందడి వాతావరణం నెలకొంటుంది. బక్రీద్ సందర్భంగా మేకలు, గొర్రెలకు భారీగా డిమాండ్ ఉంటుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా జంతువులను దిగుమతి చేసుకుంటున్నారు. మెహిదీపట్నం, లంగర్‌హౌస్, టోలిచౌకి, జియాగూడ, అంబర్‌పేట, కాచిగూడ, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా విక్రయాలు చేయనున్నారు. బక్రీద్ సందర్భంగా గొర్రెలు, మేకల ధర భారీగా పెరగనుంది. ఒక్కో జంతువు రూ.10 వేలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ పర్వదినం కోసం ఈద్గాలు, మసీద్‌లు, ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter