Mla Adi Srinivas: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి అద్వర్యలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు 2025లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , ఏ ఎస్పీ శేషాద్రిని రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ఏఎస్పి శేషాద్రి రెడ్డి ప్రారంభించగా తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ప్రభుత్వ విప్ స్వయంగా ఆటో ను నడిపారు.అనంతరం కోరుట్ల బస్టాండ్ వద్ద మానవహారంలో పాల్గొని రోడ్డు భద్రత ప్రమాణం చేశారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరు రోడ్డు ఎక్కిన నుండి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వచ్చేలా జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. డ్రైవర్ స్థానంలో కూర్చున్న వారు కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో తమ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని గమనిస్తూ ముందుకు పోవాలని సూచించారు.
మద్యం సేవించి, సెల్ ఫోన్ లు మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని,ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే.. వారి కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దను కోల్పోతారని ఆన్నారు. డ్రైవింగ్ చేస్తూ అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయని,ఇలాంటి కార్యక్రమంలో నిర్వహించడం వల్ల కొంత మందిలో అయిన మార్పు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. వాహనదారులు రోడ్డు భద్రతతో పాటు ఆరోగ్య భద్రతా కూడా ఉండేలా చూసుకోవాలని,ఆటో యూనియన్ వాళ్లకి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తానని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులను ఇలాంటి అవగాహన సదస్సుల్లో భాగస్వామ్యం చేయడం వల్ల విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పిస్తారన్నారు.పోలీసు శాఖ ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని సూచించారు.
అనంతరం భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘన నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శుభాష్ నగర్‌లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి, బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అంటూ కొనియాడారు. నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. స్వతంత్ర భారతావని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని కీర్తించారు. దేశం కన్నా ఏదీ మిన్న కాదు అని చెప్పిన ఆ యోధుని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమేనని చెప్పుకొచ్చారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి నివాళులు అర్పించినట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter