Civils Mains Prize Money: నిరుద్యోగులకు ఉత్సాహనిచ్చేలా.. ప్రభుత్వ ఉద్యోగం పొందేలా తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం ప్రకటించగా.. మరోసారి అదే ప్రకటనను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ విద్యార్థులను ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దేలా తాము ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
Also Read: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి యూటర్న్.. రేవంత్ రెడ్డి కార్యక్రమానికి మద్దతు
హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో గురువారం ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 'తెలంగాణను కోరి కొట్లాడి తెచ్చుకున్నది ఉద్యోగాల సాధన కోసమని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేపట్టినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని తరహాలో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు . ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో ముందే తెలుపుతున్నట్లు వివరించారు.
Also Read: Revanth Reddy: నవంబర్ 14న విద్యార్థులకు శుభవార్త చెబుతా: రేవంత్ రెడ్డి
ప్రశ్నాపత్రాల లీకేజీ.. ఇతర ఇబ్బందులు లేకుండా తాము విజయవంతంగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు. ప్రతిభ ఉన్నా పేదలు, మధ్య తరగతి విద్యార్థులు యూపీఎస్సీ పరీక్షలను సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారిని ఆర్థికంగా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఇంధన శాఖ తరఫున ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా అందిస్తామని చెప్పారు. మెయిన్స్ సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ప్రోత్సాహక నగదు అందిస్తామని వెల్లడించారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్, ప్రత్యేక శిక్షణ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మన రాష్ట్రానికి మేలు జరగాలంటే పెద్ద సంఖ్యలో సివిల్స్ కోచింగ్ అకాడమీలు రావాలని డిప్యూటీ సీఎం విక్రమార్క గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి