Airport Extension: రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు భారీగా పెట్టుబడులు

Airport Extension: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మరింత అభివృద్ది చెందనుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై జీఎంఆర్ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 11, 2021, 03:38 PM IST
 Airport Extension: రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు భారీగా పెట్టుబడులు

Airport Extension: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మరింత అభివృద్ది చెందనుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికై జీఎంఆర్ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన, అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Rajiv Gandhi International Airport). ఈ విమానాశ్రయం ఇప్పుడిక మరింత అభివృద్ధి చెందనుంది. విమానాశ్రయంలో ప్రయాణీకుల రాకపోకల వార్షిక సామర్ధ్యాన్ని 3.4 కోట్లకు పెంచేందుకు జీఎంఆర్ గ్రూప్ 6 వేల 3 వందల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. 2024 నాటికి రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోని ప్రయాణీకుల సామర్ధ్యాన్ని పెంచనున్నట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ డిప్యూటీ సీఈవో ఆంథోని క్రోమ్‌బెజ్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ విస్తరణకు అవసరమైన నిధుల్ని సాధ్యమైనంతవరకూ బాండ్ల ద్వారా సమీకరించనున్నారు. ఎయిర్‌పోర్ట్ విస్తరణ ప్రణాళికకు అవసరమైన 30 కోట్ల డాలర్లు అంటే 2 వేల 2 వందల కోట్ల రూపాయల సమీకరణకు జీఎంఆర్(GMR Group)హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ విదేశాల్లో బాండ్లను జారీ చేయనుంది. జీఎంఆర్ ఇన్‌ఫ్రా నుంచి విమానాశ్రయం వ్యాపారాన్ని వేరు చేసే ప్రక్రియ ఏడాది చివర్లో పూర్తి కానుందని జీఎంఆర్ తెలిపింది. రానున్న మూడేళ్ల కాలంలో హైదరాబాద్ (Hyderabad Airport)రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని జీఎంఆర్ గ్రూప్ నిర్ణయించింది. 

Also read: Petrol prices, diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. Fuel rates today

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News