Manda Jagannadham Demise: సంక్రాంతి పండుగ వేళ భారత రాష్ట్ర సమితి పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథం అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఆదివారం విషమించింది. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జగన్నాథం తుదిశ్వాస విడిచారు. అతడి మృతితో బీఆర్‌ఎస్ పార్టీతోపాటు నాగర్‌కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం అలుముకుంది.
అతడి మృతికి బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు రేవంత్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సంతాపం తెలిపారు.
నాగర్ కర్నూల్ లోక్‌సభ సభ్యుడిగామా మందా జగన్నాథం నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో మందా జగన్నాథం బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత పరామర్శించిన విషయం తెలిసిందే. అతడి అంత్యక్రియలు మంగళవారం జరిగే అవకాశం ఉంది. అతడి మృతితో నాగర్‌కర్నూలులో తీవ్ర విషాదం ఏర్పడింది.
రాజకీయ రంగ ప్రవేశం:-
1996లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ పార్టీలో చేరి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ (లోక్‌సభ) సభ్యునిగా పోటీ చేసి తొలిసారిగా ఎన్నికయ్యారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా (లోక్‌సభ) ఎన్నికయ్యారు.
1996 – 11వ లోక్‌సభకు (టిడిపి) ఎన్నికయ్యారు.
1999 – 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం) (TDP)
2004 – 14వ లోక్‌సభకు (3వసారి) తిరిగి ఎన్నికయ్యారు (TDP)
2009 – 15వ లోక్‌సభకు (4వ పర్యాయం) తిరిగి ఎన్నికయ్యారు (కాంగ్రెస్)
2014 - TRS పార్టీ నుండి పోటీ చేసి కార్ గుర్తు లో పోలిక ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి వల్ల సల్ప మెజారిటీతో ఓడిపోయారు..
2018 – న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార ప్రతినిధిగా కేబినేట్ హోదాలో నామినేట్ చేయబడింది. (9 జూన్ 2018 - 8 జూన్ 2019)
ఆ తరువాత మరొక్కసారి రెన్యూవల్ చేయబడి రెండవసారి కూడా చేసారు..
పిల్లలు:
ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.
పెద్ద కుమార్తె - మంద పల్లవి
మెడికల్ కోర్సు M.S ప్రసూతి మరియు గైనకాలజీ (లేడీస్ స్పెషలిస్ట్) లో ప్రభుత్వంలో పని చేస్తుంది.
పెద్ద కొడుకు - మంద శ్రీనాథ్
బీటెక్ (మెకానికల్ ఇంజనీర్) చవివారు సోషల్ వర్కర్ గా వున్నారు.
చిన్న కొడుకు - మంద విశ్వనాథ్
MBBS చదివి తన వృత్తిలో కొనసాగుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.