Durga mata idol Vandalised in nampally exhibition grounds video: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండులు ధ్వంసం చేశారు. నిన్న రాత్రి వరకు అమ్మవారి ఆలయంలో దాండియా ఆడి యువకులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా ఉదయం వచ్చి చూసే వరకు విగ్రహాం పూర్తిగా ధ్వంసం చేసి ఉంది. చేతులు విరగొట్టారు. పూజా సామానులకు చెద్దచెదురుగా పడేశారు. అంతేకాకుండా.. అక్కడ బారికెడ్లను సైతం తొలగించారు.
నాంపల్లి ఎక్సిబిషన్ మైదానం దగ్గర ఉద్రిక్తత
నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు.
మొదట కరెంట్ కటచేసి, సీసీ కెమెరాలు విరగగొట్టి అమ్మవారి విగ్రహం ద్వంసం చేసిన దుండగులు
సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన… pic.twitter.com/j96qKvpgHA
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2024
ఇదిలా ఉండగా.. గుర్తు తెలియని దుండగులు తెలివిగా.. కరెంట్ సప్లై బంద్ చేసి మరీ ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై దుర్గామత కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే.. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా హైదరబాద్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై హిందు సంఘాలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. కొంత మంది కావాలనే శాంతి భద్రతల సమస్యలకు విఘాతం కల్గించేలా ఈ పనులు చేస్తున్నారన్నారు.
అంతే కాకుండా.. హిందువుల పండగలను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని హిందు సంఘాలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం సీరియస్ గా స్పందించారు. ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దసరాకు ఒక రోజు ముందు, తొమ్మిది రోజులు పూజలు చేసిన అమ్మవారి విగ్రహాం ధ్వంసం కావడం పట్ల కూడా స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Read more: Amrapali Kata: ఆమ్రపాలీని అందుకే టార్గెట్ చేశారా..?... ఆమె ఏపీ వెళ్లడం వెనుక అసలు కథ ఏంటంటే..?
అమ్మవారి ధ్వంసమైన విగ్రహాం , అక్కడి మండపం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. అమ్మవారి విగ్రహాం ధ్వంసం ఘటన అర్థరాత్రి లేకుంటే... శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Hyderabad: హైదరాబాద్‌లో హైటెన్షన్.. దసరా వేళ దుర్గామాత విగ్రహాం ధ్వంసం... వీడియో వైరల్..
నాంపల్లిలో దుర్గామత విగ్రహాం ధ్వంసం..
సీరియస్ అయిన రాజాసింగ్..