Air India flights : ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చిన ఎయిర్ ఇండియా

దాదాపు 2 నెలల లాక్‌డౌన్ ( Lockdown ) చెర అనంతరం స్వేచ్చగా గాల్లో ఎగురుతూ తమ గమ్యస్థానాలకి వెళ్దాం అనుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి ( Hyderabad Airport ) చేరుకున్న ప్రయాణీకులకి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ( Air India airlines ) నిరాశే మిగిల్చింది.

Last Updated : May 25, 2020, 11:35 PM IST
Air India flights : ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చిన ఎయిర్ ఇండియా

హైదరాబాద్ : దాదాపు 2 నెలల లాక్‌డౌన్ ( Lockdown ) చెర అనంతరం స్వేచ్చగా గాల్లో ఎగురుతూ తమ గమ్యస్థానాలకి వెళ్దాం అనుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి ( Hyderabad Airport ) చేరుకున్న ప్రయాణీకులకి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ( Air India airlines ) నిరాశే మిగిల్చింది. మే 25వ తేదీ తిరిగి విమానసేవలు ప్రారంభిస్తున్నాం అంటూ విమానయాన సంస్థలు కౌంటర్లు తెరిచిన సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుంచి వివిధప్రాంతాలకి వెళ్ళేవారు.. ఉత్సాహంగా తాము వెళ్ళాల్సిన చోటికి టికెట్లు బుక్ చేసుకుని (Flight tickets booking ) విమానయాన శాఖ సూచించిన నిబంధనలు, సూచనలకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని ఎయిర్ పోర్టుకి వెళ్ళిన ప్రయాణికులకి ఎయిరిండియా మొండి చెయ్యి చూపించింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చెకిన్ ( Flights check-in ) అవడానికి సిద్దం అయ్యే సమయంలో ఫ్లైట్ క్యాన్సిల్ ( AI flight cancelled )  అయిందంటూ చావు కబురు చల్లగా తెలియచేశారు ఎయిరిండియా సిబ్బంది. ( మళ్లీ విమానయానం షురూ )

ఊహించని పరిణామంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణీకులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. సిబ్బందితో వాదించినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో నిరాశగా, నీరసంగా తిరుగుముఖం పట్టడం ప్రయాణికుల వంతయ్యింది. టికెట్ల కోసం భారీగానే దండుకున్న ఎయిర్ ఇండియా చివరికి తమని గమ్యానికైనా చేర్చకపోగా తమ డబ్బులు కూడా తిరిగి చెల్లించకపోవడం ప్రయాణికులకు మరింత కోపాన్ని తెప్పించింది. Shramik trains : ఒక రాష్ట్రానికి వెళ్లాల్సిన రైలు మరో రాష్ట్రానికి.. అయోమయంలో ప్రయాణికులు! )

బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోనూ ( Kempegowda International airport ) ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ( Air India passengers ) ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సి ఉన్న ఎయిర్ ఇండియా విమానం కూడా రద్దు కావడం ప్రయాణికులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇదే విషయమై ఓ ప్రయాణికుడు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. '' తమ బోర్డింగ్ పాస్ చెకిన్ చేసేవరకు తమ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందనే విషయం తెలియలేదు'' అని వాపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News