సీఎస్ తో మేడారంలో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలసి పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి, అడిషనల్ డీ.జీ. జితేందర్ లు పర్యటించారు. 

Last Updated : Feb 5, 2020, 05:44 PM IST
సీఎస్ తో మేడారంలో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలసి పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి, అడిషనల్ డీ.జీ. జితేందర్ లు పర్యటించారు. ఈ సందర్బంగా మేడారం లో జంపన్నవాగు, చిలకల గట్టు, గద్దె ల ప్రాంగణం, క్యూ లైన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్, ఇతర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ ఈ క్రింది విషయాలను వెల్లడించారు.

మేడారంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టామని, భక్తులకు సజావుగా దర్శనం జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా, సాధారణ భక్తులు సులువుగా అమ్మవార్ల దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ లో నిష్ణాతులైన ట్రాఫిక్ పోలీస్ అధికారుల నియమించామని, ఇద్దరు డీఐజి ర్యాంక్ అధికారులు, 6 ఎస్పి లు, 12 వేల పోలీస్ యంత్రాంగంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.

మహిళల భద్రతకు షీ టీమ్స్, 70 మంది మహిళా ఎస్సై లను నియమించామన్నారు. తొక్కిసలాట జరగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని తెలియజేశారు. అందరి సహాయ సహకరాలతో జాతరను విజయవంతం చేద్దామని, జాతర వ్యాప్తంగా  మూడు డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుపుతామని, జాతరలో 350 సర్వేలెన్స్ కెమెరాలు, 20 జూమ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసందానం చేసి నిరంతరం పర్య వేక్షణ జరుగుతుందన్నారు. వాహనాల పార్కింగ్ కు 32 ప్రాంతాల్లో స్థలాలను కల్పించామని, నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామని మహేందర్ రెడ్డి తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News