NTR Bharosa Pension Creats New Record: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ పండుగలా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబట్టి పింఛన్ పంపిణీని విజయవంతం చేశారు. పవన్ కల్యాణ్‌తో సహా ఏపీ పాలనా యంత్రాంగం మొత్తం పింఛన్ పంపిణీలో పాల్గొని సరికొత్త రికార్డు నెలకొల్పింది.
NTR Bharosa Pension: ఏపీ ప్రభుత్వం రూ.వెయ్యి పెంచి రూ.4 వేల పింఛన్‌ను జూలై 1వ తేదీ నుంచి అందిస్తోంది.
NTR Bharosa Pension: పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి లబ్ధిదారులకు పింఛన్ అందించారు.
NTR Bharosa Pension: రాష్ట్రవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పింఛన్‌ల పంపిణీ చేపట్టారు.
NTR Bharosa Pension: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది పింఛన్‌దారులకు రూ.4,408 కోట్లు పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
NTR Bharosa Pension: తొలిరోజే 100 శాతం పంపిణీకి ఏర్పాట్లు చేయగా.. రికార్డు స్థాయిలో దాదాపుగా 95 శాతం పూర్తి చేశారు.
NTR Bharosa Pension: ప్రభుత్వ యంత్రాంగంతో 12 గంటల వ్యవధిలో పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
NTR Bharosa Pension: పింఛన్ల పంపిణీని విజయవంతం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికీ సీఎం చంద్రబాబు అభినందించారు.
NTR Bharosa Pension: పింఛన్ల పంపిణీ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు.
NTR Bharosa Pension: పింఛన్ల పంపిణీలో కొన్నిచోట్ల వివాదాస్పదమైంది. టీడీపీ నాయకులు చేతివాటం చూపించారని ప్రచారం జరిగింది.
NTR Bharosa Pension: విజయనగరంలో పింఛన్ల పంపిణీపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పింఛన్ల పంపిణీకి తమను ఆహ్వానించకపోవడంపై టీడీపీ నాయకులతో జనసేన నాయకులు గొడవకు దిగారు.
NTR Bharosa Pension: కడప జిల్లా పొద్దుటూరులో వృద్ధులకు పంచాల్సిన పింఛన్ డబ్బులు రూ.4 లక్షలు దొంగతనానికి గురయ్యాయి.