హైదరాబాద్ : రెవెన్యూ చట్టంలో ( New Revenue Act 2020 ) మార్పులు చేర్పులకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ప్రస్తుతం నిలిపేసిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Congress MLA Jagga Reddy ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. '' అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎల్ఆర్ఎస్ పథకం ( LRS scheme ) అమలు విషయంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి వినిపించామని చెప్పిన జగ్గా రెడ్డి.. 131 జీవోను రద్దు చేయడంతో పాటు ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియకు 2 నెలలు సమయం సరిపోదని.. అది ఏడాదికి పొడిగించాలని కోరామని అన్నారు. అలాగే డబ్బులు సైతం 50 శాతం తగ్గించాలని కోరిన వెంటనే మంత్రి కేటీఆర్ ( Minister KTR ) తమ డిమాండ్లపై స్పందించినందుకు ఆయనకు మీడియా సాక్షిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. Also read : Malkajgiri ACP Narasimha Reddy: మల్కాజిగిరి ఏసీపీ నర్సింహా రెడ్డి నివాసంలో ACB సోదాలు
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ( Minister Talasani Srinivas Yadav ) జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ( GHMS election ) పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని మంత్రి తలసాని ఎద్దేవా చేస్తున్నారు కానీ అధికార పార్టీ వద్ద ఉన్న వాళ్లందరూ తమ వాళ్లేననే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్ సర్కారు ( TRS govt ) ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ దుకాణం ఖాళీ చేసి, వాళ్ల దుకాణం నింపుకున్నారని.. అలాగే మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే.. టీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని జగ్గారెడ్డి హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. Also read : Telangana: కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe