CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి.. తన మూడో టార్గెట్ అదే నంటూ సంచలన వ్యాఖ్యలు..

Delhi news: తెలంగాణ సీఎం కొన్నిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు.  ఇప్పటికే తెలంగాణలో వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు, మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 28, 2024, 01:35 PM IST
  • జగన్ పాములాంటోడన్న రేవంత్ రెడ్డి..
  • కేసీఆర్ ను హరీష్ రావు బుమరాంగ్ చేస్తున్నాడని వ్యాఖ్యలు..
CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన  రేవంత్ రెడ్డి.. తన మూడో టార్గెట్ అదే నంటూ సంచలన వ్యాఖ్యలు..

Cm Revanth Reddy hot comments on kcr and ys jagan: తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితోటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, మరికొందరు మంత్రులు, అలిగిన జీవన్ రెడ్డి అంతా డిల్లీలోనే మకాంపెట్టారు. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ విషయంలోకి వస్తే.. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు. తన జీవితంలో మూడు గోల్స్ అనుకున్నానని.. ఒకటి సీఎం కావడం, బీఆర్ఎస్ ను ఓడించడం రెండు జరిగాయన్నారు. ఇక మూడోది తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడం తన మూడోది అత్యంత ప్రధానమైన గోల్ గా చెప్పుకొచ్చారు.

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

ఇక బీఆర్ఎస్ లో కేటీఆర్, కవితలు ఆ తర్వాత పార్టీ కోసం, పదవీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ వట్టి డమ్మీ.. అని ఆయనను హరీష్ రావు నడిపిస్తున్నాడని, గతంలో విజయశాంతి, ఈటల రాజేంద్ర, నరేంద్రలను వెనుకుండి బైటకు పంపించాడని, పార్టీలో ప్రతిసారి ఏదో  ఒక విధంగా అనిశ్చితి కల్గజేసి తాను.. దాన్ని సరిదిద్దినట్లు ట్రిబుల్ షూటర్ అంటూ ఆ క్రేడిట్ ను తన ఖాతాలో హరీష్ రావు వేసుకుంటాడని సీఎం రేవంత్ అన్నారు. అందుకు అసెంబ్లీకి కూడా కేసీఆర్ రాకుండా.. హరీష్ రావు చాణక్యం చేస్తున్నాడని విమర్శించారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ పార్టీ మరోసారి పుంజుకునే చాన్స్ లేదని అన్నారు.

ఆయన పార్టీ ఫిరాయింపులపై మాట్లాడితే నవ్వోస్తుందని, గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి  ఎంత మంది మారారో, కేసీఆర్ చెప్పాలన్నారు. ఆయన చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అవుతాందా.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకు ప్రజలు అధికారం ఇచ్చి కూర్చుండబెడితే.. సొంత పగలు, ప్రతీకారాల కోసం రాజకీయాలు చేస్తే జగన్ కు పట్టిన గతి పడుతుందని ఇన్ డైరెక్ట్ గా విమర్శించారు. అపోసిషన్ నేతను, వయస్సులో తండ్రితో సమానమైన వ్యక్తిని నోటికొచ్చినట్లు దూశించడం, ట్రోల్స్ చేయడం, వ్యక్తిత్వ హననం కలిగే విధంగా మాట్లాడం వల్ల జగన్ కు ఈరోజు ఈ గతి పట్టిందన్నారు.

గతంలో 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు.. ఈసారి కేవలం 11 స్థానాలకు  పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. జగన్ ఒక చచ్చిన పాములాంటి వాడని అన్నారు. అంతేకాకుండా.. ఒక వేళ తెలంగాణలో జరిగిన ఎన్నికలలో టీడీపీ పొటీచేసి ఉంటే.. తమకు కొంచెం  ఓట్లశాతం తక్కువగా వచ్చేదని అన్నారు. ఏపీ చంద్రబాబు కు గట్టి పోటీని ఇచ్చే విధంగా తాను కూడా కష్టపడి పనిచేస్తున్నానని అన్నారు. అంతేకాకుండా.. లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి వద్ద ప్రాపర్టీని చంద్రబాబు చెబితే కూలగొట్టించినట్లు కొందరు ఆరోపణలు చేశారు.

ఇది పూర్తిగా అవాస్తవమని, ఒక మంత్రి చెబితే అక్కడి అధికారులు ఇలా చేసినందుకు వెంటనే ఆ అధికారిని సరెండర్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తన ప్రత్యర్థి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ పక్కన ఏవేవో అక్రమంగా నిర్మించుకున్నాడు. వాటిపై చర్యలు తీసుకోలేదు.. ఇక జగన్ తో మాకేంటి అంటూ క్లారిటీ ఇచ్చారు.

Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

హైదరాబాద్ కు అమరావతి పోటీ కాదన్నారు. హైదరాబాద్ లో ఉన్నవారు.. ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడరు. అలాంటిది హైదరాబాద్ ను వదిలేసి, పెట్టుబడి దారులు.. అమరావతికి వెళ్తారనే ప్రచారంలో నిజంలేదని సీఎం రేవంత్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను రెండు కార్పోరేషన్లుగా విభజించి కమిషనరేట్లుగా చేస్తామని రేవంత్ అన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News