Osmania University: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో.. హాస్టళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రూ. 7.5 కోట్లు విడుదల చేసింది. వర్సిటీ విద్యార్థుల కోసం మొత్తం రూ.30 కోట్ల అంచనాలతో సాగుతున్న రెండు వేర్వేరు హాస్టళ్ల నిర్మాణానికి (యువతులు, యువకుల కోసం) తొలివిడతగా ఈ నిధులను విడుదల చేసింది. ఇటీవల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సందర్శించిన సందర్భంగా.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిపోయారు.
హాస్టళ్ల నిర్వహణ సరిగ్గాలేని కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వర్సిటీ వీసీ, ఉన్నతాధిఅధికారులతో మాట్లాడారు. అనంతరం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ గారితో మాట్లాడి పరిస్థితిని వివరించారు. హాస్టల్ భవనాల నిర్మాణం ఆవశ్యకతను వివరించారు.
ఈ సందర్భంగా ఉస్మానియాలో దాదాపు రూ.30 కోట్ల అంచనాతో రెండు హాస్టల్ భవనాలను (ఒక్కోదాంట్లో 250 మంది విద్యార్థుల సామర్థ్యంతో) యువతుల కోసం, యువకులకోసం.. హాస్టళ్లు నిర్మించేందుకు 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే.. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రికి లేఖలు రాశారు.
కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన పథకంలోని బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన కింద 250 మంది విద్యార్థుల సామర్థ్యంతో మొత్తం 500 మంది విద్యార్థులకు సరిపోయేలా బాలికలకు ఒకటి, బాలురకు ఒకటి రెండు హాస్టళ్ల నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుపుకోనున్న ఈ హాస్టళ్లు ఒక్కొక్కదానికి రూ. 14.60 కోట్ల చొప్పున దాదాపు రూ. 30 కోట్ల వ్యయంతో రెండు హాస్టళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి స్పందించిన వీరేంద్ర కుమార్ గారు.. ఈ హాస్టల్ భవనాల నిర్మాణానికి సానుకూలంగా స్పందిస్తూ.. తొలివిడతగా రూ.7.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: Jawan OTT Release: జవాన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్, ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే
ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన కిషన్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈ రెండు నూతన హాస్టళ్లను వీలయినంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఎస్సీ విద్యార్థులకు సమయానికి స్కాలర్ షిప్ లను మంజూరు చేయడమే కాకుండా, విద్య పూర్తయిన అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణతోపాటుగా ఉపాధి కల్పన వంటి వారి ప్రతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వారి సాధికారతకు నరేంద్రమోదీ ప్రభుత్వం నిరంతరం తోడ్పాటును అందిస్తూనే ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook