Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..

Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.   ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 5, 2024, 09:01 PM IST
  • చిక్కడ పల్లి ఘటన..
  • అల్లు అర్జున్ కు ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..

Case filed against Allu arjun in chikkadpalli: పుష్ప2 ది రూల్ మూవీ ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఈ మూవీ నిన్న (డిసెంబర్ 4వ తేదీన) రిలీజైంది. అయితే.. రీలిజ్ రోజు చూడాలని.. దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ X రోడ్స్ లోని సంధ్య 70ఎంఎంకు వచ్చారు. అయితే.. అప్పటికే అక్కడ విపరీమైన రద్దీ ఉంది. అయితే.. లోపలికి ప్రవేశించి క్రమంలో తోపులాట జరిగింది. అప్పుడు.. రేవతి కింద పడిపోయింది. ఆమె కొడుకు.. శ్రీతేజ్ సైతం కింద పడిపోయారు.

ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. శ్రీతేజ్ మాత్రం..పోలీసులు సీపీఆర్ చేయడంతో బాలుడిలో కదలికలు వచ్చినట్లు తెలుస్తొంది. కానీ అతని తల్లి రేవతి మాత్రం చనిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం శ్రీతేజ్ కండీషన్ సీరియస్ గా ఉందని వైద్యులు చెప్తున్నారు.  ఈ క్రమంలో.. థియేటర్ యాజమాన్యం సైతం ముందస్తు జాగ్రత్తులు తీసుకొలేదని తెలుస్తొంది. దీంతో పోలీసులు ఇప్పటికే యాజమాన్యంపై కేసుల్ని నమోదు చేశారు. మరోవైపు వివిధ సంఘాలు నేతలు, చనిపోయిన మహిళ కుటుంబీకులు, లాయర్లు పోలీసుల్ని కలిసి అల్లు అర్జున్, ఆయన టీమ్ పై కేసుల్ని నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తొంది.

ఈ క్రమంలో పోలీసులు తాజాగా, అల్లు అర్జున్.. సుకుమార్, ఆయన టీమ్ మీద కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది.105, 118(1)r/w3(5)  BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది.  ఇదిలా ఉండగా.. ఇదివరకు ఆయన ఏపీలో ఎన్నికల సమయంలో.. ప్రచారంలోకి వెళ్లడం వల్ల అక్కడి పోలీసులు కేసును నమోదుచేశారు. అయితే.. ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించినట్లు తెలుస్తొంది.

Read more: Sobhita Dhulipala: శోభితా మరో సంచలనం.. సమంతను అప్పుడే వెనక్కు నెట్టేసిందిగా.. సోషల్ మీడియాలో ప్రశంసలు..

ఇప్పుడు మరోమారు కేసు నమోదు కావడం మాత్రం అల్లు అర్జున్ కు ఊహించని ట్విస్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంట. బన్నీ అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఇప్పటికే ఈ ఘటనపై చనిపోయిన మహిళ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News