Vijayashanthi: ఆ రోజు ఏడ్చాను.. రాక్షసుడు ఎదురయ్యాడు.. టార్చర్ అనుభవించా: విజయశాంతి ఎమోషనల్

Vijayashanthi Political Journey: విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బీజేపీ కార్యాలయంలో ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణం గుర్తు చేసుకుంటూ విజయశాతం ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారో చెప్పుకొచ్చారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 08:50 PM IST
Vijayashanthi: ఆ రోజు ఏడ్చాను.. రాక్షసుడు ఎదురయ్యాడు.. టార్చర్ అనుభవించా: విజయశాంతి ఎమోషనల్

Vijayashanthi Political Journey: తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే  తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం గుర్తు చేసుకుంటూ విజయశాంతి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

తనది 25 ఏళ్ల రాజకీయం ప్రస్థానం.. చాలా పెద్ద ప్రయాణం అని అన్నారు విజయశాంతి. 1998 జనవరి 21న వాజ్ పేయి, అద్వానీలను కలిసిశానని.. తనకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయన్నారు. అవినీతి లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని తన నమ్మకం అని అన్నారు. తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చాననని.. తనకు పదవులపై ఆశ లేదన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కోరికే ఉండేదని.. ఆ రోజు సమైక్యవాద నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని విజయశాంతి అన్నారు. అందుకే సమైక్యవాదులతో పోరాడేందుకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని.. అయితే ఆరోజు పార్టీని వీడినందుకు ఏడ్చానని చెప్పారు. నాలుగున్నరేళ్లు పార్టీని నడిపి ఎన్నో సమస్యలపై పోరాడానని.. ఆ సమయంలో ఒక రాక్షసుడు ఎదురయ్యాడని పేర్కొన్నారు. తెలంగాణ పేరుతో ముసుగు కప్పుకుని వచ్చి నమ్మించి మోసం చేశారని వాపోయారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకున్నాడని.. విలీనం చేసినప్పటి నుంచి తాను ఏనాడూ ప్రశాంతంగా లేనన్నారు. 

ఎంతో టార్చర్ అనుభవించానని.. ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఓడగట్టేందుకు కుట్ర చేశారని ఆమె చెప్పారు. 2013లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే అదేరోజు రాత్రి తనను సస్పెండ్ చేశారని.. తన తప్పేమిటో చెప్పలేదన్నారు. అయితే తనకు విముక్తి కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశానే తప్ప బాధపడలేదన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ రాకూడదనే కేసీఆర్ సహా చాలా మంది ఎంపీలు భావించారని గుర్తు చేసుకున్నారు. తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేసుకుంటానని.. ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బండి సంజయ్ నాయకత్వంలోనే మళ్లీ ఎన్నికల్లోకి పోతున్నామని.. మోదీ పీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

Also Read: Nara Lokesh: జ‌గ‌న్‌ బుల్లెట్ లేని గ‌న్‌.. సౌండ్ ఎక్కువ ప‌ని త‌క్కువ‌: నారా లోకేష్ సెటైర్లు  

Also Read: Unstoppable Pawan Kalyan Promo: మూడు పెళ్లిళ్లపై అడిగేసిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News