Eatala Rajender FIR: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎంపీ ఈటల రాజేందర్ దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన ఎంపీ ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడితోపాటు బీజేపీ నాయకులపై కూడా నమోదు చేయడం గమనార్హం. భూ వివాదంలో రియల్ ఎస్టేట్ వారిపై దాడి చేసి దౌర్జన్యంగా ప్రవర్తించిన అంశంలో ఈటల చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనం రేపింది.
Also Read: Jagadish Reddy: 'నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గుండాల రాజ్యం.. బీఆర్‌ఎస్ పార్టీ అంటే భయం'
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో భూవివాదం కొనసాగుతోంది. స్థానికులను కొందరు బెదిరిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. స్థానికులపై దౌర్జన్యం చేస్తున్న కొందరిపై ఎంపీ చేయి చేసుకున్నారు. ఎంపీ దాడి చేయడంతో అతడి అనుచరులు, బీజేపీ నాయకులు కూడా వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర వివాదం రేపింది. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఈటల రాజేందర్, ఘట్‌కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు శివారెడ్డి, శ్రీనివాస్, జుబేర్ అక్రమ్ తమపై దాడి చేశారని నారపల్లికి చెందిన గ్యార ఉపేందర్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. బీజేపీ నాయకుల దాడిలో రఫీక్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న ఉపేందర్ పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీకారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగా కేసు నమోదుతో ఈ వివాదం మరింత రచ్చగా మారుతోంది. ఈ వ్యవహారంపై ఈటల రాజేందర్ దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పేదల కోసం తాను ఎంతవరకైనా వెళ్తానని ప్రకటించారు. రియల్ ఎస్టేట్ పేరుతో పేదల భూములను లాగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter