MMTS Cancelled: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. 2 రోజులు ఎంఎంటీఎస్‌ రైళ్లు బంద్‌

MMTS Services Cancelled Two Days Due To Secunderabad Station Re Development Works: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. రోజువారీగా ప్రయాణించే ఎంఎంటీస్‌ రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఎందుకో తెలుసా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 19, 2024, 11:33 PM IST
MMTS Cancelled: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. 2 రోజులు ఎంఎంటీఎస్‌ రైళ్లు బంద్‌

MMTS Services Cancelled: హైదరాబాద్‌ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎంటీసీ రైళ్ల రాకపోకల్లో మార్పులుచేర్పులు జరిగాయి. రోజువారీగా నడిచే ఈ రైళ్ల రాకపోకలపై రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొన్ని గంటలపాటు రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజులు పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఈ మేరకు గమనించి తమకు సహకరించాలని ఈ మేరకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ

సికింద్రాబాద్ మార్గం గుండా
అయితే అకస్మాత్తుగా రెండు రోజుల పాటు ఎంఎంటీసీ రైళ్లను రద్దు చేయడానికి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులే కారణం. దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన స్టేషన్‌గా ఉన్న సికింద్రాబాద్‌లో ఆధునీకరణ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే విధంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ పనులను ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టేషన్‌ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం

శరవేగంగా అభివృద్ధి పనులు
రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనుల కారణంగా ఈ స్టేషన్‌ గుండా రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్‌ రైళ్లను నిలిపివేశారు. జూలై 20, 21 తేదీల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మొత్తం 11 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసింది. వాటిలో ప్రధానంగా ఫలక్‌నుమా, లింగంపల్లి, రామచంద్రాపురం మార్గాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్‌ మీదుగా ఈ ఎంఎంటీఎస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కాగా వారాంతాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయడంతో కొంత ప్రయాణికులను ఊరట కలిగించే విషయమే. పని దినాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసి ఉంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అంతేకాకుండా ఇతర రవాణా వ్యవస్థలపై ఒక్కసారిగా భారం పడే అవకాశం ఉండేది.

రద్దయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఇవే..
Tr.no.47177 రామచంద్రాపురం- ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌
Tr.no. 47156 ఫలక్‌నుమా - సికింద్రాబాద్‌ ఎంఎంటీఎస్‌
Tr.no.47185 సికింద్రాబాద్‌ - ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌
Tr.no.47252 ఫలక్‌నుమా - సికింద్రాబాద్‌ ఎంఎంటీఎస్‌
Tr.no.47243 సికింద్రాబాద్‌ - మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌
Tr.no.47241 మేడ్చల్‌ - సికింద్రాబాద్‌ ఎంఎంటీఎస్‌
Tr.no.47250 సికింద్రాబాద్‌- ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌
Tr.no 47201 ఫలక్‌నుమా - హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ 
Tr.no.47119 హైదరాబాద్‌- లింగంపల్లి ఎంఎంటీఎస్‌
Tr.no.47217 లింగంపల్లి - ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌
Tr.no.47218 ఫలక్‌నుమా - రామచంద్రాపురం ఎంఎంటీఎస్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News