MP Arvind Vehicle Attack : ఎంపీ అర్వింద్‌ ధర్మపురి కారుపై దాడి, టీఆర్‌‌ఎస్ కార్యకర్తలే చేశారంటోన్న ఎంపీ!

MP Dharmapuri Arvind Vehicle Attack : తనపై దాదాపు 200 మంది టీఆర్‌‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారని చెప్పిన ఎంపీ అర్వింద్‌ ధర్మపురి. పోలీసులే దగ్గర ఉండి తన వాహనంపై దాడి చేయించారన్న ఎంపీ.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 04:24 PM IST
  • బీజేపీ ఎంపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వాహనంపై దాడి
  • రాళ్లతో దాడులు చేసిన టీఆర్ఎస్‌ శ్రేణులు
  • నందిపేట్‌ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు
    వెళ్తుండగా ఘటన
  • ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో అటాక్
MP Arvind Vehicle Attack : ఎంపీ అర్వింద్‌ ధర్మపురి కారుపై దాడి, టీఆర్‌‌ఎస్ కార్యకర్తలే చేశారంటోన్న ఎంపీ!

MP Arvind Vehicle Attack : బీజేపీ ఎంపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వాహనంపై టీఆర్ఎస్‌ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. నందిపేట్‌ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ అర్వింద్‌ బయల్దేరారు. ఈ క్రమంలో ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఎంపీ అర్వింద్‌ (MP Arvind) కారు అద్దాలు ధ్వంసం (Vehicle Attack) అయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

కాగా ఎంపీ అర్వింద్‌ కారుపై దాడి జరగడంతో.. బీజేపీ, (BJP) టీఆర్ఎస్‌ శ్రేణులు ఘర్షణకు దిగాయి. . పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్‌లో బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

కాగా నందిపేట్‌ మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా టీఆర్ఎస్‌ (TRS) కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పష్టం చేశారు. దాదాపు 200 మంది టీఆర్‌‌ఎస్ కార్యకర్తలు తమకు అడ్డు తగిలారని ఎంపీ చెప్పారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వేశారని ఆరోపించారు. 

ఇక ఈ విషయంపై సీపీ, ఏసీపీలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వారంతా ప్రేక్షకపాత్ర వహించారని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. పోలీసులే దగ్గర ఉండి తమ వాహనాలపై దాడి చేయించారంటూ అర్వింద్‌ తప్పుపట్టారు.

Also Read : UP Elections 2022: కాంగ్రెస్​కు సీనియర్‌ నేత ఆర్‌పీఎన్‌ సింగ్ గుడ్‌బై

ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. అలాగే బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి కూడా ఈ ఘటనను తీసుకెళ్తానని ఆయన తెలిపారు. టీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలే రాళ్లతో తనపై దాడి చేశారంటూ పోలీసు కమిషనర్‌కు ఎంపీ అర్వింద్‌ (MP Arvind) ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

Also Read : Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ.. డీహెచ్ శ్రీనివాసరావు కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News