Allu arjuna files petition in Telangana high court: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ప్రస్తుతం ఒక వైపు రికార్డుల పరంపర కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప2 మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోయినట్లు తెలుస్తొంది. అయితే.. ఈ మూవీ ఒకవైపు రికార్డుల పరంగా వార్తలలో ఉంటే.. మరొవైపు కాంట్రవర్సీ అంశాల పరంగా కూడా రచ్చగా మారుతుంది. ఈ మూవీ ఇటీవల రీలీజ్ అయినప్పుడు హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే..ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్ , మూవీ టీమ్, సంధ్య థియేటర్ పైకూడా కేసుల్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. పుష్ప2 మూవీ టీమ్ విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా అల్లు అర్జున్ సైతం... ఈఘటనపై తన సంతాపం వ్యక్తం చేస్తు, ఆ కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని కూడా వీడియో రిలీజ్ చేశారు. మరొవైపు.. బాధిత కుటుంబానికి 25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
సినిమాలో కోట్లకు కోట్లు వసూళ్లు చేసి..బాధితులకు మాత్రం.. కేవలం 25 లక్షలు ఇచ్చి వదిలించుకొవాలని చూస్తున్నారా.. అంటూ కొందరు అల్లు అర్జున్ పై, పుష్ప టీమ్ పైఫైర్ అయినట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరొ కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది.
పుష్ప2 ఘటన సమయంలో నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ తెలంగాణ హైకొర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టివేయాలని లాయర్ లతో.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు సంబంధించి తనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ లో కోరినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.