U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్‌ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్‌' పేరుతో మరో బాంబు

Aleti Maheshwar Reddy U Tax Allegations On Uttam Kumar Reddy: మొన్న ఆర్‌ ట్యాక్స్‌, బీ ట్యాక్స్ తో సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి తాజాగా మరో బాంబు పేల్చాడు. మంత్రి ఉత్తమ్‌ కుంభకోణం చేశాడని సంచలన ఆరోపణలు చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 21, 2024, 04:45 PM IST
U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్‌ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్‌' పేరుతో మరో బాంబు

Uttam Kumar Reddy U Tax: అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలు విమర్శల దాటి కొనసాగిస్తున్నాయి. బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఆర్‌ ట్యాక్స్‌ పేరిట సంచలన ఆరోపణలు చేయగా.. తాజాగా యూ ట్యాక్స్‌ అంటూ కొత్తగా మరో బాంబు పేల్చారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కుంభకోణాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. మరో కుంభకోణాన్ని బయటపెడుతున్నట్లు ప్రకటించారు.

Also Read: Telangana Song: తెలంగాణ ఆవిర్భావ కానుక.. ఎంఎం కీరవాణి స్వరకల్పనలో కొత్తగా పాట

 

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మహేశ్వర్‌ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.వేల కోట్ల కుంభకోణాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆర్‌ ట్యాక్స్‌.. ఇప్పుడు యూ ట్యాక్స్‌ అని సంచలన ఆరోపణ చేశారు. 'రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలపై ఎప్పటికప్పుడు బీజేపీ బయటపెడుతోంది.. ఇప్పుడు మరో కుంభకోణం బయట పెడుతున్నా. కొత్తగా 'యూ' ట్యాక్స్ పేరిట అధికారులకు ఎంత ఇస్తున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తున్నారు?' అని ప్రశ్నించారు.

Also Read: TS Cabinet: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను పిలుస్తాం: మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..

 

యూ ట్యాక్స్‌ కుంభకోణం ఇది
'రైతులు పండించిన పంటలు స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి తెలంగాణలో లేదు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అదనంగా తూకం చేస్తున్నారు. వాటికి రశీదు ఇవ్వడం లేదు. ఇలా ఒక్కో క్వింటాల్‌కు 10 నుంచి 12 కిలోలు కొల్లగొడుతున్నారు. అధిక దాన్యం జోకడంతో వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి. కొల్లగొట్టిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఏమవుతున్నాయనేది సివిల్ సప్లయ్ కమిషనర్, శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఆ డబ్బులో నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.500 కోట్లు కేసీ వేణుగోపాల్‌కి ఇచ్చారు. రైస్ మిల్లర్లతో మంత్రి కుమ్మక్కయ్యారు. రూ.450 కోట్లు రైస్ మిల్లర్లు ఇచ్చారు. ఇది మొత్తం రూ.950 కోట్ల కుంభకోణం' అని మహేశ్వర్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

యూ ట్యాక్స్ పేరిట అధికారులకు ఎంత ఇస్తున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆ డబ్బులో నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.500 కోట్లు కేసీ వేణుగోపాల్ కి ఇచ్చింది వాస్తవం కాదా? అని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి రేసులో ఎక్కడ వెనుకబడిపోతానేమో అనే భయంతో వేణుగోపాల్‌కు డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. తోటి మిత్రులు ఇచ్చి ముందుకు వెళ్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా? అని అడిగారు.

ధాన్యం క్రయవిక్రయాలకు ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మహేశ్వర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము ఈ తప్పులను నిరూపిస్తామని చెప్పారు. ఇది సామాన్యుల రక్తాన్ని తాగే కుంభకోణం అని ప్రకటించారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతులను ఆదుకోవాలని.. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News