Vivo T2 Pro 5G Price: ధర తక్కువ, స్పెషిఫికేషన్స్‌ ఎక్కువ..ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T2 Pro 5G మొబైల్‌..

Vivo T2 Pro 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు Vivo కంపెనీ T2 Pro 5G సిరీస్‌ మొబైల్‌ను విడుదల చేయబోతోంది..ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర, ఫీచర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2023, 01:16 PM IST
Vivo T2 Pro 5G Price: ధర తక్కువ, స్పెషిఫికేషన్స్‌ ఎక్కువ..ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T2 Pro 5G మొబైల్‌..

 

Vivo T2 Pro 5G Price: తక్కువ బడ్జెట్‌ ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? వివో మీకు శుభవార్తను అందిస్తోంది. వివో విడుదల చేసే Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్ రేవు మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి అధికారిక సమాచారాన్ని ఇప్పటికే విడుదల చేసింది. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌పోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయించబోతున్నట్లు పేర్కొంది. అందరినీ ఆకర్శించేందుకు ఈ ఫోన్‌ను గోల్డ్ కలర్ వేరియంట్‌లో కస్టమర్స్‌కి పరిచయం చేయబోతోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోయే Vivo T2 Pro 5G 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1200 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌ MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా 8GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌లో విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌  4K వీడియోను రికార్డ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

ఈ మొబైల్‌ను కంపెనీ గతేడాది లాంచ్ చేసిన Vivo T1 Pro 5Gకి సక్సెసర్ గా  కంపెనీ విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధిచిన ధర వివరాలను ఇంకా అధికారికంగా వివరించలేదు. కానీ కొంతమంది టిప్‌స్టార్స్‌ Vivo T2 ప్రో ధరకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. కంపెనీ 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Vivo T1 Pro 5G ఫీచర్స్‌ వివరాలు:
6.44 అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్‌
1080x2404 పిక్సెల్‌లు
స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ 
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 
2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ 

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News