Toyota Mini Fortuner 2025 Model: భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో, థార్ రోక్స్‌లకు మామూలు డిమాండ్ లేదు. అత్యంత ప్రీమియం ఫీచర్స్‌తో తక్కువ ధరలోనే లభించడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాగే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కూడా అద్భుతమైన SUV ని పరిచయం చేయబోతోంది. ఇది మినీ ఫార్చ్యూనర్ పేరుతో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇది ఏఏ ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతుందో? ఈ మినీ ఫార్చ్యూనర్ ఎప్పుడు విడుదల కాబతుందో తెలుసుకోండి.
టయోటా మినీ ఫార్చ్యూనర్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా మోనోకోక్-ఆధారిత 4×4 డిజైన్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఈ కారు బాడీ చూడడానికి అచ్చం స్పోర్ట్స్ లుక్‌లో కనిపించబోతోంది. అంతేకాకుండా ఆఫ్ రోడ్ చేసేవారికి ఈ బెస్ట్ అనిపించుకునేందుకు వివిధ రకాల సేఫ్టీ ఫీచర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది.
మినీ ఫార్చ్యూనర్ SUV కారును కంపెనీ ముందుగా ఒక కలర్ ఆప్షన్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కారు ఇంజన్ వివరాల్లోకి వెళితే..దీనిని కంపెనీ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో విడుదల చేయబోతోంది. ఈ ఇంజన్ గతంలో విడుదల చేసిన ఇన్నోవా హైక్రాస్ కు ఉన్న ఇంజన్ మాదిరిగానే ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మినీ ఫార్చ్యూనర్ సంబంధించిన పూర్తి వివరాలను టయోటా కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ 2027 సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం. ఇక దీని ధర గతంలో టయోటా విడుదల చేసిన హై ఎండ్ కార్ల కంటే చాలా తక్కువగానే ఉండబోతున్నట్లు సమాచారం.
మార్కెట్లో మహేంద్ర కంపెనీ విడుదల చేస్తున్న కొత్త కొత్త కార్లకు పోటీగా ఈ మినీ ఫార్చ్యూనర్ నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మహీంద్రా విడుదల చేసిన మహీంద్రా థార్ రోక్స్, స్కార్పియో కార్ల కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అనేకరకాల వేరియంట్లలో ఈ కారు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మినీ ఫార్చ్యూనర్ కారు డిజైన్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దీని ఫీచర్స్ కూడా ఇటీవల లీక్ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ఈ కారు మార్కెట్లోకి విడుదలయితే చాలా లగ్జరీ కార్లకు పోటీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని భారత ఆటో నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter